Celebrate “Cow Hug Day” On Valentine’s Day: ప్రేమికుల రోజుకు (వాలెంటైన్స్ డే)కి మరో వారమే సమయం ఉంది. అయితే యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా వినూత్న ప్రకటన చేసింది. వాలెంటైన్స్ డేను ‘‘ కౌ హగ్ డే’’గా జరుపుకోండని సూచించింది. ఆవును కౌగిలించుకోవడం ద్వారా ఫిబ్రవరి 14 రోజును జరుపుకోవాలని బుధవారం విజ్ఞప్తి చేసింది. దీనికి సంబంధించి బోర్డు నోటీసు జారీ చేసింది. ఆవులను కౌగిలించుకోవడం వల్ల “భావోద్వేగ సంపద” మరియు “వ్యక్తిగత మరియు సామూహిక ఆనందం” పెరుగుతాయని నోటీసులో పేర్కొంది.
Read Also: INDvsAUS Test : సచిన్ రికార్డుపై కన్ను..టీమిండియా కాదు ఆసీస్ బ్యాటర్‌కే సాధ్యం
ఆవు భారతీయ సంస్కృతికి,గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని, మన జీవితాన్ని నిలబెడుతుందని, పశువుల సంపద జీవవైవిధ్యానికి ప్రాతినిధ్యం వహిస్తుందని మనందరికీ తెలుసని.. మానవాళికి పోషక పదార్థాలు అందిస్తుంటం వల్ల ఆవును ‘కామధేను’గా ఓ తల్లిగా చూస్తున్నామని బోర్డు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. పాశ్యాత్య సంస్కృతి వేగంగా విస్తరిస్తుండటం వల్ల వైదిక సంప్రదాయాలను రక్షించడంలో ఆవును సంరక్షించడం తోడ్పడుతుందని బోర్డు తెలిపింది.