Delhi Road Accident: ఢిల్లీ యాక్సిడెంట్ కేసులో మరో ట్విస్ట్.. స్కూటీపై మరో యువతి కూడా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CCTV footage reveals Anjali Singh Leaving Hotel With Friend Nidhi: దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం సృష్టించిన యువతి యాక్సిడెంట్ కేసులో తాజాగా ఒక ఊహించని ట్విస్ట్ వెలుగు చూసింది. యాక్సిడెంట్ జరిగిన సమయంలో స్కూటీపై అంజలి సింగ్‌తో పాటు మరో యువతి కూడా ఉన్నట్టు తేలింది. ఆ అమ్మాయిని నిధిగా గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలనలో భాగంగా ఈ విషయం బయటపడింది. ఒక హోటల్లో జరిగిన న్యూ ఇయర్ వేడుకల్లో నిధి, అంజలి కలిసి పాల్గొన్నారని.. అర్ధరాత్రి దాటాక 1:45 గంటలకు వాళ్లిద్దరు స్కూటీపై బయలుదేరారని పోలీసులు చెప్తున్నారు. హోటల్ ముందున్న సీసీటీవీ కెమెరాల్లో.. వాళ్లిద్దరు స్కూటీపై బయలుదేరడం రికార్డయ్యిందని, ఆ దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.
Hyderabad Drugs Case: షాకింగ్ నిజాలు బయటపెట్టిన కృష్ణ కిశోర్ రెడ్డి
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
ఆ సీసీటీవీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ప్రకారం.. హోటల్ దగ్గర బయలుదేరుతున్నప్పుడు స్కూటీని నిధి నడుపుతోందని, మధ్యలో వాళ్లిద్దరు తమ సీట్లు మార్చుకున్నారని పోలీసులు వివరించారు. ప్రమాదం జరిగిన సమయంలో నిధి కూడా స్కూటీపైనే ఉందని, అయితే ఆమె స్వల్ప గాయాలతో బయటపడిందని తేలిందన్నారు. భయంతో ఆమె సంఘటనా స్థలం నుంచి వెళ్లిపోయిందని చెప్పారు. పోలీసు విచారణలో భాగంగా.. ప్రమాదం జరిగినప్పుడు తాను స్వల్ప గాయాలతో బయటపడ్డానని, కానీ అంజలి కాలు మాత్రం కారులో ఇరుక్కుపోయిందని నిధి తెలిపింది. దాంతో ఆమెను కారు లాక్కెళ్లిందని పేర్కొంది. తాను కొంత దూరం నడిపిన తర్వాత స్కూటీ నడుపుతానని అంజలి కోరిందని, అలా తాము తమ సీట్లను మార్చుకున్నామని నిధి వెల్లడించింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు తాను తీవ్ర భయాందోళనలకు లోనయ్యానని, అంజలి కాలు కారుకి ఇరుక్కోవడంతో మరింత భయపడ్డానని నిధి చెప్పుకొచ్చింది.
Sreeja Konidela: 2022లో ఓ ముఖ్యమైన వ్యక్తిని కలిశా.. కొత్త జర్నీ ప్రారంభమైంది
కాగా.. ఆదివారం తెల్లవారుజామున స్కూటీని ఢీ కొట్టిన కారు, అంజలి సింగ్‌ని 12 కిలోమీటర్లు మేర లాక్కెళ్లింది. యూటర్న్ తీసుకుంటూ వాళ్లు లాక్కెళ్లడంతో, అంజలి నగ్నంగా మారిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. కారులో ఉన్న ఐదుగురు యువకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో తాము మద్యం మత్తులో ఉన్నట్లు వాళ్లు నేరం అంగీకరించారు. ప్రమాదం సమయంలో.. కారు కింద ఏదో చిక్కుకున్నట్లు డ్రైవింగ్ చేసిన దీపక్ ఖన్నా విచారణలో చెప్పినట్లు సమాచారం. అయితే.. తన మాటల్ని మిగతా నలుగురు కొట్టిపారెయ్యడంతోనే తాను కారు ఆపకుండా నడిపానని దీపిక్ వివరించాడు.
IndiGo Flight: థాయిలాండ్ వెళ్లాల్సిన ఇండిగో విమానం.. సాంకేతిక లోపంతో..
తాజావార్తలు
-
Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి ‘నో’ చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Matsya: పడవ కింద నుంచి వెళ్లిన ‘మిథికల్ ఫిష్’.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ ‘మత్స్య’!
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!