NTV Telugu Site icon

Delhi Road Accident: ఢిల్లీ యాక్సిడెంట్ కేసులో మరో ట్విస్ట్.. స్కూటీపై మరో యువతి కూడా..

Anjali With Friend Nidhi

Anjali With Friend Nidhi

CCTV footage reveals Anjali Singh Leaving Hotel With Friend Nidhi: దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం సృష్టించిన యువతి యాక్సిడెంట్ కేసులో తాజాగా ఒక ఊహించని ట్విస్ట్ వెలుగు చూసింది. యాక్సిడెంట్ జరిగిన సమయంలో స్కూటీపై అంజలి సింగ్‌తో పాటు మరో యువతి కూడా ఉన్నట్టు తేలింది. ఆ అమ్మాయిని నిధిగా గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలనలో భాగంగా ఈ విషయం బయటపడింది. ఒక హోటల్‌లో జరిగిన న్యూ ఇయర్ వేడుకల్లో నిధి, అంజలి కలిసి పాల్గొన్నారని.. అర్ధరాత్రి దాటాక 1:45 గంటలకు వాళ్లిద్దరు స్కూటీపై బయలుదేరారని పోలీసులు చెప్తున్నారు. హోటల్ ముందున్న సీసీటీవీ కెమెరాల్లో.. వాళ్లిద్దరు స్కూటీపై బయలుదేరడం రికార్డయ్యిందని, ఆ దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.

Hyderabad Drugs Case: షాకింగ్ నిజాలు బయటపెట్టిన కృష్ణ కిశోర్ రెడ్డి

ఆ సీసీటీవీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ప్రకారం.. హోటల్ దగ్గర బయలుదేరుతున్నప్పుడు స్కూటీని నిధి నడుపుతోందని, మధ్యలో వాళ్లిద్దరు తమ సీట్లు మార్చుకున్నారని పోలీసులు వివరించారు. ప్రమాదం జరిగిన సమయంలో నిధి కూడా స్కూటీపైనే ఉందని, అయితే ఆమె స్వల్ప గాయాలతో బయటపడిందని తేలిందన్నారు. భయంతో ఆమె సంఘటనా స్థలం నుంచి వెళ్లిపోయిందని చెప్పారు. పోలీసు విచారణలో భాగంగా.. ప్రమాదం జరిగినప్పుడు తాను స్వల్ప గాయాలతో బయటపడ్డానని, కానీ అంజలి కాలు మాత్రం కారులో ఇరుక్కుపోయిందని నిధి తెలిపింది. దాంతో ఆమెను కారు లాక్కెళ్లిందని పేర్కొంది. తాను కొంత దూరం నడిపిన తర్వాత స్కూటీ నడుపుతానని అంజలి కోరిందని, అలా తాము తమ సీట్లను మార్చుకున్నామని నిధి వెల్లడించింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు తాను తీవ్ర భయాందోళనలకు లోనయ్యానని, అంజలి కాలు కారుకి ఇరుక్కోవడంతో మరింత భయపడ్డానని నిధి చెప్పుకొచ్చింది.

Sreeja Konidela: 2022లో ఓ ముఖ్యమైన వ్యక్తిని కలిశా.. కొత్త జర్నీ ప్రారంభమైంది

కాగా.. ఆదివారం తెల్లవారుజామున స్కూటీని ఢీ కొట్టిన కారు, అంజలి సింగ్‌ని 12 కిలోమీటర్లు మేర లాక్కెళ్లింది. యూటర్న్ తీసుకుంటూ వాళ్లు లాక్కెళ్లడంతో, అంజలి నగ్నంగా మారిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. కారులో ఉన్న ఐదుగురు యువకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో తాము మద్యం మత్తులో ఉన్నట్లు వాళ్లు నేరం అంగీకరించారు. ప్రమాదం సమయంలో.. కారు కింద ఏదో చిక్కుకున్నట్లు డ్రైవింగ్ చేసిన దీపక్ ఖన్నా విచారణలో చెప్పినట్లు సమాచారం. అయితే.. తన మాటల్ని మిగతా నలుగురు కొట్టిపారెయ్యడంతోనే తాను కారు ఆపకుండా నడిపానని దీపిక్ వివరించాడు.

IndiGo Flight: థాయిలాండ్ వెళ్లాల్సిన ఇండిగో విమానం.. సాంకేతిక లోపంతో..

Show comments