CBSE Three-Language Policy: సీబీఎస్ఈ త్రిభాషా విధానంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. విద్యార్థులకు ఊరట..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CBSE Three-Language Policy: సీబీఎస్ఈ 9వ తరగతి విద్యార్థులకు ప్రవేశపెట్టిన త్రిభాషా విధానంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విద్యా సంవత్సరం మధ్యలో జూలై 1 నుంచి కొత్త నిబంధనను అమలు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం విచారణ చేపట్టింది. కొత్త భాషలు నేర్చుకునే క్రమంలో విద్యార్థులు ఎదుర్కొనే ఆచరణాత్మక ఇబ్బందులపై పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కొత్త విధానం ప్రకారం 9వ తరగతి విద్యార్థులు మూడు భాషలను తప్పనిసరిగా నేర్చుకోవాల్సి ఉంటుంది. అందులో రెండు భారతీయ భాషలు ఉండాలి. అయితే ఈ విధానాన్ని విద్యా సంవత్సరం మధ్యలో అకస్మాత్తుగా అమలు చేయడంతో విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పిటిషనర్లు వాదించారు.
టీచర్లు, పుస్తకాలు లేకుండా ఎలా?
గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు కొత్త భాషలను బోధించేందుకు అవసరమైన పుస్తకాలు, అర్హత కలిగిన ఉపాధ్యాయులు అందుబాటులో లేరని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఆన్లైన్లో పుస్తకాలు అందుబాటులో ఉంచడం మాత్రమే పరిష్కారం కాదని, గ్రామీణ విద్యార్థుల పరిస్థితిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. విద్యా సంవత్సరం మధ్యలో కొత్త నిబంధనను అమలు చేయడం వల్ల ఇప్పటికే వేరే విధానంలో చదువుతున్న విద్యార్థులపై అదనపు భారం పడుతుందని వాదించారు.
Also Read
- Kerala: కేరళ మహిళను పెళ్లి చేసుకున్న స్కాట్లాండ్ ఎంపీ.. ఫొటోలు వైరల్
- Lucknow Crime: భార్యను చంపి.. వాట్సాప్ స్టేటస్‌లో షాకింగ్ మెసేజ్! ఆ తర్వాత గంటల్లోనే మరో దారుణం, చివరికి సూసైడ్..
- Assam: పట్టాలపైకి భారీ ఏనుగుల గుంపు.. నిలిచిపోయిన రైళ్లు
- Southern Zonal Council Meeting: సీట్లు తగ్గొద్దు.. నిధులు తగ్గొద్దు.. దక్షిణాది రాష్ట్రాల ఉమ్మడి డిమాండ్
విద్యార్థులను ఫెయిల్ చేయం
విచారణ సందర్భంగా విద్యార్థులకు ఊరటనిచ్చే అంశాలను సుప్రీంకోర్టు, కేంద్రం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ స్పష్టం చేశారు. కొత్త భాషను ప్రవేశపెడితే, దానిని బోధించేందుకు అవసరమైన ఉపాధ్యాయులను కూడా అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత బోర్డుదేనని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ విధానంలో విద్యార్థులకు కేవలం అంతర్గత మూల్యాంకనం మాత్రమే ఉంటుందని ఏఎస్జీ వివరించారు. ఒకవేళ విద్యార్థి 9వ తరగతిలో అర్హత సాధించకపోయినా.. వారిని వెనుకబడి పోయేలా చేయకుండా 10వ తరగతికి ప్రమోట్ చేస్తామని స్పష్టం చేశారు. దీంతో త్రిభాషా విధానం కారణంగా విద్యార్థులు ఫెయిల్ అవుతారనే ఆందోళనకు ప్రభుత్వం తరఫున వివరణ ఇచ్చినట్లైంది.
భాషల మధ్య పరస్పర అభ్యాసంపై సీజేఐ ప్రశ్న
విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి భాషలకు సంబంధించిన కీలక ప్రశ్నను లేవనెత్తారు. దక్షిణ భారతదేశ ప్రజలు ఉత్తర భారతదేశ భాషను, ఉత్తర భారతదేశ ప్రజలు దక్షిణ భారతదేశ భాషను నేర్చుకునేలా ఒక వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేయకూడదని ప్రశ్నించారు. కొత్త త్రిభాషా విధానంపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందడం సహజమేనని సీజేఐ వ్యాఖ్యానించారు. విధానం అమలులో సమస్యలు కొనసాగితే న్యాయస్థానం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసే అవకాశం ఉందని లేదా అలాంటి కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించవచ్చని సూచించారు. మొత్తంగా సీబీఎస్ఈ త్రిభాషా విధానం అమలు, విద్యార్థులకు అవసరమైన బోధనా వసతులు, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధ్యాయుల లభ్యత వంటి అంశాలపై సుప్రీంకోర్టు విచారణలో కీలక చర్చ జరిగింది.
తాజావార్తలు
-
CBSE Three-Language Policy: సీబీఎస్ఈ త్రిభాషా విధానంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. విద్యార్థులకు ఊరట..
-
Konda Surekha : కొండా సురేఖ రివర్స్ కౌంటర్.. ‘నా కూతురు మాటలకు నేనెందుకు?’
-
AP Junior Doctors Strike: చర్చలు విఫలం.. స్టైఫండ్ పెంపుపై పట్టు.. జూడాల సమ్మె ఉధృతం..!
-
Kerala: కేరళ మహిళను పెళ్లి చేసుకున్న స్కాట్లాండ్ ఎంపీ.. ఫొటోలు వైరల్
-
Varalakshmi Vratam Naivedyam Recipes : వరలక్ష్మీ వ్రతం స్పెషల్.. 5 నైవేద్యాలు ఇలా చేస్తే టైమ్ సేవ్.!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!