CBSE: త్రిభాషా విధానంపై సీబీఎస్ఈ సంచలన నిర్ణయం
- త్రిభాషా విధానంపై సీబీఎస్ఈ సంచలన నిర్ణయం
- ఈ ఏడాది నుంచి 3 భాషాల విధానం అమలకు ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. 2026-27 విద్యాసంవత్సరం నుంచి 9, 10 తరగతుల విద్యార్థులకు మూడు భాషలు తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. జూలై 1, 2026 నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి రానుంది. ఈ మేరకు మే 15న సీబీఎస్ఈ సర్క్యులర్ విడుదల చేసింది. జాతీయ విద్యా విధానం (NEP) 2020, నేషనల్ కరికులం ఫ్రేమ్‌వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ (NCF-SE) 2023కు అనుగుణంగా ఈ మార్పులు చేపట్టినట్లు బోర్డు వెల్లడించింది.
మూడు భాషలు తప్పనిసరి
కొత్త నిబంధనల ప్రకారం 9, 10 తరగతుల విద్యార్థులు R1, R2, R3 పేర్లతో మూడు భాషలను తప్పనిసరిగా అభ్యసించాలి. వీటిలో కనీసం రెండు భారతీయ స్థానిక భాషలే ఉండాలని సీబీఎస్ఈ స్పష్టం చేసింది. విద్యార్థులు విదేశీ భాషను ఎంపిక చేసుకోవాలంటే.. మిగతా రెండు భాషలు భారతీయ భాషలే కావాలి. అలాగే విదేశీ భాషను అదనపు నాలుగో భాషగా కూడా తీసుకునే అవకాశం కల్పించారు.
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
ఎన్సీఈఆర్టీ సిలబస్ ఆధారంగా నిర్ణయం
2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించిన 9, 10 తరగతుల ఎన్సీఈఆర్టీ సిలబస్‌ను సమీక్షించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీబీఎస్ఈ తెలిపింది. ప్రస్తుతం విద్యాసంవత్సరం ఇప్పటికే ప్రారంభమైనందున మార్పులను దశలవారీగా అమలు చేస్తామని పేర్కొంది.
తాత్కాలిక ఏర్పాట్లు
కొత్త R3 పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి వచ్చే వరకు 2026-27 విద్యాసంవత్సరంలో 9వ తరగతి విద్యార్థులు 6వ తరగతి R3 పుస్తకాలను ఉపయోగించాల్సి ఉంటుంది. అదనంగా స్థానిక, రాష్ట్ర స్థాయి సాహిత్యాన్ని కూడా బోధనలో భాగం చేయాలని పాఠశాలలకు సూచించింది. ఇందులో కవితలు, చిన్న కథలు, కథా సాహిత్యం వంటివి ఉండొచ్చని తెలిపింది. సప్లిమెంటరీ మెటీరియల్ ఎంపిక, బోధనా విధానాలపై పూర్తి మార్గదర్శకాలను జూన్ 15, 2026లోగా విడుదల చేస్తామని సీబీఎస్ఈ వెల్లడించింది. అలాగే 19 షెడ్యూల్డ్ భారతీయ భాషలకు సంబంధించిన 6వ తరగతి R3 పాఠ్యపుస్తకాలను జూలై 1, 2026కు ముందే పాఠశాలలకు అందుబాటులో ఉంచుతామని సీబీఎస్ఈ ప్రకటించింది.
ప్రత్యేక వెసులుబాటు
కొన్ని పాఠశాలల్లో భారతీయ భాషల బోధనకు అర్హత కలిగిన ఉపాధ్యాయులు అందుబాటులో లేకపోవచ్చని సీబీఎస్ఈ అంగీకరించింది. ఈ నేపథ్యంలో తాత్కాలికంగా కొన్ని ప్రత్యేక చర్యలకు అనుమతి ఇచ్చింది. సహోదయ క్లస్టర్ల ద్వారా పాఠశాలల మధ్య ఉపాధ్యాయుల భాగస్వామ్యం. ఇక రిటైర్డ్ భాషా ఉపాధ్యాయుల సేవలు వినియోగించడం.. అర్హత కలిగిన పీజీ అభ్యర్థులను నియమించడం వంటి చర్యలను చేపట్టవచ్చని తెలిపింది.
తాజావార్తలు
-
Tilak Varma: ఆ పొజిషన్లో బ్యాటింగ్ చేయడమే ఇష్టం.. కానీ తప్పడం లేదు!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
Deputy CM Pawan Kalyan: మళ్లీ వాయిదాపడిన పవన్ కల్యాణ్ పోలవరం జిల్లా పర్యటన..
-
TGSRTC Union Elections: పదేళ్ల తర్వాత ఆర్టీసీ ఎన్నికలు.. మొదలైన పోలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే?
-
Red Magic 12 Pro+: 8,400mAh బ్యాటరీతో Red Magic 12 Pro+.. RGB లిక్విడ్ కూలింగ్‌తో కొత్త గేమింగ్ ఫోన్!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!