NTV Telugu Site icon

Kolkata doctor case: సీబీఐ కీలక నిర్ణయం.. సందీష్ ఘోష్ సహా నలుగురు డాక్టర్లకు లై డిటెక్టర్ పరీక్ష

Doctorcase

Doctorcase

కోల్‌కతా వైద్యురాలి హత్యాచార కేసు దర్యాప్తును సీబీఐ వేగవంతం చేసింది. కోల్‌కతా హైకోర్టు ఆదేశించిన వెంటనే రంగంలోకి దిగిన అధికారులు ఇప్పటికే పలు కీలక విషయాలను రాబట్టారు. అయితే రంగంలోకి దిగికముందే క్రైమ్ సీన్ ఆనవాళ్లు చెరిపేసినట్లుగా గుర్తించారు. దీంతో దర్యాప్తు సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. కోల్‌కతా ఆర్జీ కర్ ఆస్పత్రి అండ్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్‌ సందీప్‌ ఘోష్‌ సహా ఈ కేసుతో సంబంధమున్న మరో నలుగురు వైద్యులకు పాలిగ్రాఫ్‌ టెస్టు చేసేందుకు సిద్ధమయ్యారు. సీబీఐ చేసిన విజ్ఞప్తిని కోల్‌కతాలోని ప్రత్యేక కోర్టు అనుమతించింది. ఇప్పటికే నిందితుడు సంజయ్ రాయ్‌కు పాలిగ్రాఫ్‌ టెస్టుకు అనుమతి లభించింది.

ఇది కూడా చదవండి: UP: హిందు అబ్బాయిని పెళ్లాడిన ముస్లిం అమ్మాయి.. గన్ తో బెదిరించి మతం మార్చిన ముస్లిం పెద్దలు!.. స్టేషన్ లో ఫిర్యాదు

సీబీఐ విచారణలో సందీప్ ఘోష్ పొంతనలేని సమాధానాలు చెబుతున్నట్లు తెలుస్తోంది. విచారణకు ఏ మాత్రం సహకరించడం లేదని సమాచారం. ఇక ఘటన తర్వాత.. సందీప్ ఘోషే.. బాధిత కుటుంబానికి తప్పుడు సమాచారం ఇప్పించినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఒక ప్రణాళిక ప్రకారం క్రైమ్ ఆఫ్ సీన్‌ కూడా మార్చేసినట్లుగా సీబీఐ అభిప్రాయపడుతుంది. సందీప్ ఘోష్‌తో సహా మరో నలుగురు వైద్యులు ఆయనతోనే ఉన్నట్లుగా సీబీఐ భావించింది. మరింత సమాచారం రాబట్టడం కోసం పాలిగ్రాఫ్‌ టెస్టుకు రెడీ అయింది. దీంతో కీలక సమాచారాన్ని సీబీఐ రాబట్టనుంది.

ఇది కూడా చదవండి: Employees Transfers: బదిలీల నుంచి తప్పించుకోవడానికి ఉద్యోగుల అడ్డదారి..! సర్కార్‌ సీరియస్‌

ఇక వైద్యులు తక్షణమే విధుల్లో చేరాలని సర్వోన్నత న్యాయస్థానం నిరసన చేస్తున్న డాక్టర్లకు సూచించింది. మరోవైపు ఆర్జీ కర్ ఆస్పత్రి దగ్గర కేంద్ర భద్రతా బలగాలు మోహరించాయి. గురువారం సుప్రీంకోర్టు ఈ కేసు విచారణ సందర్భంగా మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌పై మండిపడింది. తీవ్రంగా ధ్వజమెత్తింది. అంతేకాకుండా బాధితురాలు దహన సంస్కారాలు పూర్తయ్యాక కేసు నమోదు చేయడంపై కూడా పోలీస్ యంత్రాంగంపై మండిపడింది. ఇదిలా ఉంటే న్యాయం కోసం దేశ వ్యాప్తంగా మహిళా సంఘాలు, రాజకీయ పార్టీలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు.

ఇది కూడా చదవండి: AAY : ఏంటి.. ఆయ్ సినిమా ఇంత కలెక్ట్ చేసిందా.. వామ్మో