Site icon NTV Telugu

Cauvery row: కర్ణాటకలో కావేరి చిచ్చు.. బెంగళూర్ బంద్‌కు పిలుపు

Cauvery Row

Cauvery Row

Cauvery row: కావేరీ నీటి వివాదం కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతోంది. తమిళనాడుకు ఇటీవల కర్ణాటక ప్రభుత్వం కావేరీ నీటిని విడుదల చేయడాన్ని ఆ రాష్ట్ర ప్రజలు తప్పుపడుతున్నారు. నీటి విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ 300కు పైగా సంస్థలు మంగళవారం బెంగళూర్ బంద్ కి పిలుపునిచ్చాయి. ఇదిలా ఉంటే మరోవైపు మాండ్యా జిల్లాలో రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు. మరికొన్ని సంఘాలు బందుకు పిలుపునిచ్చే యోచనలో ఉన్నాయి.

Read Also: Delhi University elections: ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఏబీవీపీ ఘన విజయం..నాలుగింటిలో మూడు స్థానాలు కైవసం..

ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన నాయకుడు చంద్రూ మాట్లాడుతూ.. తమ డిమాండ్‌లన్నింటిని నెరవేర్చాలంటూ టౌన్ హాల్ నుంచి మైసూర్ బ్యాంక్ సర్కిల్ వరకు వెళ్లి కర్ణాటక ప్రభుత్వానికి మెమోరాండం ఇస్తామని చెప్పారు. తమిళనాడుకు కావేరి నీటి విడులను నిలిపివేయడంతో పాటు సమస్యపై అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ పరిణామాలపై ఉపముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి డీకే శివకుమార్ స్పందించారు. ఈ ఆందోళనల్లో రాజకీయ కోణం ఉందని, కర్ణాటక రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు తాము ఉన్నామని అన్నారు. బంద్ కు పిలుపునివ్వవద్దని ఆందోళనకారుల్ని కోరారు. తమిళనాడుకు 5000 క్యాసెక్కుల నీటని విడుదల చేయాలని ఆదేశిస్తూ కావేరీ వాటార్ మేనేజ్మెంట్ బోర్డు (సీడబ్ల్యుఎంఏ) ఆదేశాలపై జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు గురువారం నిరాకరించింది.

Exit mobile version