NTV Telugu Site icon

Police: మహిళా కానిస్టేబుల్‌తో హోటల్ గదిలో పట్టుబడిన డీఎస్పీ.. కానిస్టేబుల్‌గా డిమోషన్..

Dsp

Dsp

Police: మహిళా కానిస్టేబుల్‌తో ఓ హోటల్ గదిలో పట్టుడిని పోలీస్ ఉన్నతాధికారిని కానిస్టేబుల్ ర్యాంక్‌కి తగ్గించారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. హోటల్ గదిలో మహిళా కానిస్టేబుల్‌తో రాజీపడే స్థితితో పట్టుబడిని డిప్యూటీ సూపరింటెండెంట్ కృషా శంకర్ కన్నౌజియాను యూపీ పోలీసులు మూడేళ్ల తర్వాత కానిస్టేబుల్ స్థాయికి డిమోట్ చేశారు.

గతంలో ఉన్నావ్‌లోని బిఘాపూర్‌లో సర్కిల్ ఆఫీసర్(సీఓ)గా పనిచేసిన శంకర్ కనౌజియా ప్రస్తుతం గోరఖ్‌పూర్‌లోని 6వ ప్రావిన్షియల్ ఆర్మ్‌డ్ కాన్‌స్టాబులరీ (PAC) బెటాలియన్‌కు కేటాయించబడ్డారు. జూలై 2021లో లీవ్ తీసుకున్న తర్వాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కుటుంబ కారణాలు పేర్కొంటూ కన్నౌజియా ఉన్నతాధికారుల అనుమతితో లీవ్ లీసుకున్నాడు. అయితే, ఆ సమయంలో ప్రైవేట్, అధికారిక మొబైల్ నెంబర్లను స్విచ్ ఆఫ్ చేయడం అనుమానాలకు తావిచ్చింది.

Read Also: Fraud Case : అధిక లాభాలు ఆశ చూపి గోల్డ్ ట్రేడింగ్ లో ఇన్వెస్ట్మెంట్ పేరిట భారీ మోసం..

తన భర్త కనిపించడం లేదని కన్నౌజియా భార్య ఎస్పీకి ఫిర్యాదు చేసింది. కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు, అతని మొబైల్ చివరిసారిగా కాన్పూర్‌లోని ఒక హోటల్ వద్ద చివరిసారిగా ఆగిపోయిందని తెలిసింది. దీంతో పోలీసులు హోటల్‌కి వెళ్లి చూడగా, కన్నౌజియా, మహిళా కానిస్టేబుల్‌తో పట్టుబడ్డాడు. సీసీటీవీ కెమెరాలు, వారి ఎంట్రీకి సంబంధించినప అన్ని కీలక సాక్ష్యాలను సేకరించారు. ఈ ఘటనపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. దీంతో కన్నౌజియాను తిరిగి కానిస్టేబుల్ స్థాయికి మార్చాలని ప్రభుత్వం సిఫార్సు చేసింది. ADG అడ్మినిస్ట్రేషన్ వెంటనే ఈ నిర్ణయాన్ని అమలు చేయడానికి ఒక ఉత్తర్వును జారీ చేసింది. దీంతో అతను ఉన్నతాధికారి నుంచి పతనమయ్యాడు.

Show comments