NTV Telugu Site icon

TRS MLAs: సుప్రీంకోర్టుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసు వ్యవహారం

Trs Mlas To Supreme Court

Trs Mlas To Supreme Court

TRS MLAs: తెలంగాణాలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం సంచలంగా మారిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐ లేదా.. సిట్టింగ్ జడ్జి విచారణకు అప్పగించాలన్న బీజేపీ పిటిషన్​ నేడు ఢిల్లీకి చేరింది. ఇవాళ సుప్రీంకోర్టులో దీనిపై విచారించేందుకు సిద్దమైంది. తెలంగాణ పోలీసుల అరెస్టును సవాల్ చేసిన రామచంద్ర భారతి సహ ముగ్గురు నిందితులు.. కేసును జస్టిస్ గవాయి, జస్టిస్ బీవీ నాగరత్న ధర్మాసనం విచారణ చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర పోలీసుల దర్యాప్తుపై విశ్వాసం లేదని, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. నిందితులకు బీజేపీకు ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ తమ నేతలపై దుష్ప్రచారం చేసేందుకు రాజకీయంగా ఈ కేసులు పెట్టారని పిటిషన్​ లో పేర్కొన్న విషయం తెలిసిందే.

అయితే..గతంలో ఈ పిటిషన్​ విచారణ జరిపిన హైకోర్టు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసే వరకు దర్యాప్తు నిలిపివేయాలని ఆదేశించడంతో ప్రస్తుతం ఆ కేసు దర్యాప్తు ఆగిపోయింది. ఇక బీజేపీ పిటిషన్ కొట్టివేయాలంటూ కేసు తీవ్రతను వివరిస్తూ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. ఈనేపథ్యంలో.. సుమారు మూడు గంటల వీడియోలను కూడా హైకోర్టుకు సమర్పించింది. అయితే..ఈ కేసులో ఫోన్ టాపింగ్ జరిగిందని తనను ఇంప్లేడ్ చేయాలంటూ జర్నలిస్టు శివప్రసాద్ రెడ్డి కూడా ఓ పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. సీఎం పర్యవేక్షణలో కేసు దర్యాప్తు జరుగుతున్నందున పోలీసులపై నమ్మకం లేదని సీబీఐకి లేదా స్వతంత్ర విచారణకు ఆదేశించాలని అప్పటివరకు ఆడియోలు, వీడియోలు విడుదల చేయకుండా మద్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని నిందితుడు నందకుమార్ భార్య చిత్రలేఖ కూడా మరో పిటిషన్ దాఖలు చేశారు. వీటన్నింటినీ కలిపి నేడు హైకోర్టులో జస్టిస్ బి. విజయసేన్ రెడ్డితో కూడిన ధర్మసనం విచారణ జరపారు. ఈకేసును సోమవారానికి వాయిదా వేశారు.

Read also: Twitter Down: ట్విట్టర్ డౌన్.. లాగిన్‌లో సమస్యలు

మెయిన్‌బాద్‌లోని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఫాంహౌజ్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే.. నాటకీయ పరిణామాల మధ్య నందకుమార్‌, సింహయాజులు, రామ చంద్రభారతి లను అరెస్ట్‌ చేశారు పోలీసులు అంటూ టాక్‌ వినిపిస్తుంది. అయితే దీనిపై నంద కుమార్ మాట్లాడుతూ.. పూజల కోసం మాత్రమే మేము ఫామౌస్ కు వెళ్ళామని వెల్లడించారు. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో వాస్తవం లేదని ఆయన మండిపడ్డారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫిర్యాదు చేసినట్టు మాకు తెలియదని, సింహయాజులు స్వామిజీ తో సామ్రాజ్య లక్మి పూజ జరిపించడానికి మాత్రమే ఫాంహౌస్ కు వెళ్ళామన్నారు. మునుగోడు ఎన్నికల నేపథ్యంలోనే ఇదంతా చేస్తున్నారని, ఎన్నికలు కాబట్టే ఏలాంటి సమాచారంతో సోదాలు చేశారో మాకు తెలియదన్నారు. స్కామ్ ఎక్కడది.. అసలు ఏంస్కాం మాకు తెలియదని ఆయన అన్నారు. న్యాయాన్ని నమ్ముతున్నాం.. న్యాయ స్థానంలో న్యాయం గెలిచిందని, త్వరలో మీడియాకు అన్ని వివరాలు వెళ్లాడిస్తామని ఆయన వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.. అయితే నేటి విచారణతో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తేలనుంది.
CM Jagan Gokavaram Tour Live Updates: గోకవరంలో అస్సాగో ఇండస్ట్రీ శంకుస్థాపన లైవ్ అప్ డేట్స్