Site icon NTV Telugu

Kolkata: మూగజీవంపై అమానుషం.. గుర్రం యజమానిపై కేసు

Horse

Horse

ఓ వైపు దేశంలో విపరీతమైన ఎండలు. ఇంకోవైపు ఉక్కపోత. బయటకు రావాలంటేనే ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఉదయం నుంచే భానుడు భగభగమండిపోతున్నాడు. దీంతో ప్రజలతో పాటు మూగజీవాలు కూడా విలవిలలాడిపోతున్నాయి. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో బండి లాగుతున్న గుర్రం హఠాత్తుగా రహదారిపై నీరసించి పడిపోయింది. అయితే గుర్రం యజమాని మాత్రం మూగజీవం పట్ల కర్కశంగా ప్రవర్తించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: JD Vance: ఉగ్ర వేటలో భారత్‌కు సహకరించండి.. పాక్‌కు జేడీవాన్స్ సూచన

కోల్‌కతా వీధిలో గుర్రం బండి వెళ్తోంది. అయితే ఎండ వేడిమి తట్టుకోలేక ఒక గుర్రం కుప్పకూలిపోయింది. అనంతరం గుర్రం యజమాని.. ఆ గుర్రాన్ని బలవంతంగా కొట్టి.. తాడుతో లాగే ప్రయత్నం చేశాడు. కానీ ఆ మూగజీవి నీరసించి లేవలేకపోయింది. ఈ ఘటనపై జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. మూగజీవి పట్ల దుర్మార్గం ప్రవర్తించిన యజమానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను నటి పూజా భట్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. తక్షణమే గుర్రపు బండ్ల వాడకాన్ని నిషేధించాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కోరారు.

ఇది కూడా చదవండి: Chiranjeevi : అనిల్ రావిపూడి చిరు మూవీలో మరో మెగా హీరో..!

అయితే గుర్రం పోషకాహార లోపంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతోనే సన్‌స్ట్రోక్ కారణంగా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అయితే ఈ సంఘటన జంతు ప్రేమికులకు ఆగ్రహాన్ని తెప్పించింది. వీడియో వైరల్ కావడంతో పోలీసులు గుర్రపు నిర్వాహకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే నెటిజన్లు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

 

Exit mobile version