Site icon NTV Telugu

Uttar Pradesh: హిందువులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఎంఐఎం నేత.. కేసు బుక్ చేసిన యోగి సర్కార్

Mim Uttar Paradesh

Mim Uttar Paradesh

Case against MIM party leader for making controversial remarks: ఉత్తర్ ప్రదేశ్ ఎంఐఎం అధ్యక్షుడు షౌకత్ అలీ హిందువులపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం అయ్యాయి. దీనిపై హిందువుల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తం అయింది. అక్బర్ జోధా బాయిని పెళ్లి చేసుకున్నాడు మనకన్నా సెక్యులర్ ఎవరు..? ముస్లింలు రెండు వివాహాలు చేసుకుంటారు.. ఇద్దరు భార్యలను గౌరవిస్తారు. అయితే హిందువులు ఒకరిని పెళ్లి చేసుకుని ముగ్గురితో ఎఫైర్స్ పెట్టుకుంటారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

సంభాల్ లో జరిగిన ర్యాలీలో హిందువులకు వ్యతిరేకంగా రెచ్చగొట్టతే వ్యాఖ్యలు చేశారు. 832 ఏళ్ల పాటు హిందువులను ముస్లింలు పాలించారని.. హిందువులు ముస్లిం పాలకులకు చేతులు జోడించి ‘జీహుజూర్’ అన్నారని చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. హిందువులకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Read Also: Russia-Ukraine War: రష్యా సైనిక శిక్షణా శిబిరంపై ఉగ్రదాడి..11 మంది మృతి

షౌకత్ అలీపై ఐపీసీ సెక్షన్ 153ఏ (మతం, జాతి, పుట్టిన ప్రదేశం, భాష మొదలైన వాటి ఆధారంగా వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని పెంపొందించడం), 295ఏ (మత భావాలను రెచ్చగొట్టే ఉద్దేశ్యపూర్వక చర్య) కింద కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ చక్రేష్ మిశ్రా తెలిపారు. బీజేపీ బలహీనపడినప్పుడు ముస్లింలు పైకి వస్తారని.. కొన్ని సార్లు వారు ముస్లింలు ఎక్కువ మంది పిల్లలు కంటున్నారని అంటారని.. కొన్నిసార్లు రెండు వివాహాలు చేసుకుంటారని అంటారని అంటూ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదాస్పద వ్యాఖ్యల అనంతరం షౌకత్ అలీ మాట్లాడుతూ.. నా వ్యాఖ్యలు ఏ మతానికి వ్యతిరేకం కాదని వివరణ ఇచ్చాడు. షౌకత్ అలీ వ్యాఖ్యలపై ఎంఐఎం పార్టీ ఎలాంటి అధికారిక వివరణ ఇవ్వలేదు.

Exit mobile version