NTV Telugu Site icon

Tejasvi Surya: తప్పుడు వార్తలను ప్రచారం చేశారంటూ బీజేపీ ఎంపీపై కేసు నమోదు..

Tejasvi Surya

Tejasvi Surya

Tejasvi Surya: కర్ణాటకలోని హవేరి జిల్లాకు చెందిన రైతు రుద్రప్ప చన్నప్ప బాలికై తన భూమిని వక్ఫ్ బోర్డు స్వాధీనం చేసుకోవడంతో సూసైడ్ చేసుకున్నట్లు.. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, మంత్రి జమీర్‌ అహ్మద్‌ చర్యల వల్ల రైతులు కుంగిపోతున్నారని ఇటీవల సోషల్‌మీడియా వేదికగా బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య ఆరోపించారు. అయితే, 2022 జనవరిలో రైతు రుద్రప్ప పంట నష్టం, రుణ భారం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని, భూ సమస్యల వల్ల కాదని హవేరీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వెల్లించారు.

Read Also: Apple iOS 18.2: స్టన్నింగ్ ఫీచర్లతో సాఫ్ట్‌వేర్ అప్డేట్‌ను ఇచ్చిన ఆపిల్ సంస్థ

కాగా, రైతు రుద్దరప్ప ఆత్మహత్యను వక్ఫ్ భూములకు ముడి పెడుతూ పోస్టు పెట్టి.. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారనే ఆరోపణలతో బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్యతో పాటు రెండు కన్నడ పత్రికల ఎడిటర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. వక్ఫ్ నోటీసులకు వ్యతిరేకంగా హవేరీలో రైతులు ఆందోళన తెలియజేస్తున్నారని.. ఈ ఘటనతో రైతు మానసిక క్షోభకు గురై సూసైడ్ చేసుకున్నారని వార్తా పత్రికలు తెలిపాయి. కాగా, ఆ పోస్టును ప్రస్తుతం ఎంపీ సూర్య డిలీట్ చేశారు.

Read Also: CJI DY Chandrachud: సీజేఐగా లాస్ట్ వర్కింగ్ డే.. అలీగఢ్‌ యూనివర్సిటీపై కీలక తీర్పు..

అయితే, కర్ణాటక అంతటా వక్ఫ్ భూముల సమస్యలపై ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఎంపీ తేజస్వి సూర్య.. జాయింట్ పార్లమెంటరీ (జేపీసీ) కమిటీ ఛైర్మన్ జగదాంబికా పాల్ ఆందోళన చేపడుతున్న రైతుల దగ్గరకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వక్ఫ్ ఆస్తులపై నిజ నిర్ధరణ నివేదికను పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అందజేస్తామని పాల్ తెలిపారు. ఇదిలా ఉండగా.. రైతులకు కొత్త వక్ఫ్ నోటీసులు జారీని నిలిపివేయాలని.. ఇప్పటికే ఉన్న నోటీసులను ఉపసంహరించుకోవాలని సీఎం సిద్ధరామయ్య అధికారులను ఆదేశించారు.

Show comments