NTV Telugu Site icon

Chennai Rains: చెన్నైలో మిచౌంగ్ తుఫాన్ బీభత్సం.. కొట్టుకుపోతున్న కార్లు..

Untitled 5

Untitled 5

Chennai: చెన్నైలో మిచౌంగ్ తుఫాన్ బీభత్సం సృష్టిస్తుంది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలు జనజీవనాన్ని అతలాకుతంలం చేస్తున్నాయి. కురుస్తున్న భారీ వర్షాలకు పలు చోట్ల రోడ్ల పైన వరద నీరు చేరి ఉదృతంగా ప్రవహిస్తోంది. ఈ వరద నీటి ఉద్రిక్తతకు పలు చోట్ల పలు కార్లు కొట్టుకుపోయాయి. అలానే ఎయిర్‌పోర్టు రన్‌వేపైకి అధిక మొత్తంలో వరద చేరింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే 16 విమాన సర్వీసులను నిలిపివేశారు. ఈ విషయం పైన అధికారు మాట్లాడుతూ ఉద్రిక్తంగా మారిన తుఫాను కారణంగా ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలను నిలిపివేసామని.. అలానే మరికొన్ని విమానాలను దారిమళ్లించామని అధికారులు తెలిపారు.

Read also:Telangana: తెలంగాణలో ప్రారంభమైన రాజీనామాల పర్వం..

కాగా కురుస్తున్న భారీ వర్షాలకు కనతూరు ప్రాంతంలో ఓ గోడ కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు కూలిలు మృతిచెందారు. కాగా సోమవారం అర్ధరాత్రి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. కాగా ప్రస్తుతం బీభత్సం సృష్టిస్తున్న వర్షాలకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కాగా ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాలకు అప్రమత్తమైన చెన్నై ప్రభుత్వ యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా చర్యలను చేపట్టింది. పలు చోట్ల రైలు మార్గాలను మూసివేసింది. అలానే పలు రైళ్ల రాకపోకలను నిలిపివేసింది. అలానే ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను ఏర్పాటు చేశారు. కాగా తాంబ్రం ప్రాంతంలో నీటిలో చిక్కుకొన్న 15 మందిని ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రక్షించాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా చెన్నైలో పలు ప్రాంతాలు జలమయమైయ్యాయి. ఈ నేపధ్యంలో పాఠశాలలకు, నగరం లోని కోర్టులకు సెలవులు ఇచ్చినట్లు మద్రాస్‌ హైకోర్టు ప్రకటించింది.