మహారాష్ట్రలో ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల సందడి సాగుతోంది. ముంబై, పూణె లాంటి మహా నగరాలతో పాటు పలు మున్సిపల్ నగరాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఆయా పార్టీలకు చెందిన వ్యక్తులు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఒక వింతైన సంఘటన చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Switzerland: న్యూఇయర్ వేళ ఘోర విషాదం.. ఓ బార్‌లో భారీ పేలుడు.. పలువురు మృతి
పూణె నగరంలోని 34వ వార్డు స్థానానికి ఇద్దరు అభ్యర్థులు ఉద్ధవ్ కాంబ్లీ, మచ్చీంద్ర ధవాలే నామినేషన్ పత్రాలు ఇచ్చారు. ధంకవాడి సహకర్‌నగర్ వార్డు కార్యాలయంలో బుధవారం నామినేషన్లు వేశారు. అయితే నామినేషన్ సందర్భంగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో కాంబ్లీ అనే వ్యక్తి… ధవాలే నామినేషన్ పత్రాలు లాక్కొని చించేసి నమిలేశాడు. దీంతో ధవాలే అవాక్కయ్యాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాంబ్లీపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Zohran Mamdani: న్యూయార్క్ మేయర్‌గా మమ్దానీ ప్రమాణం.. దేనిపై ప్రమాణం చేశారంటే..!
జనవరి 15న మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు మాత్రం జనవరి 16న విడుదల కానున్నాయి. ప్రధాన పార్టీల మధ్య ఫైటింగ్ నడుస్తోంది. నువ్వానేనా? అన్నట్టుగా ఫైటింగ్ సాగుతోంది. ఇప్పటికే స్థానిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలిచి మంచి జోష్ మీద ఉంది.
