5 States Elections: గాడిదపై వచ్చి నామినేషన్.. ఎన్నికల సిత్రాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
5 States Elections: 5 రాష్ట్రాల ఎన్నికలకు కొన్ని రోజులే సమయం ఉంది. వచ్చే నెలలో తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గడ్, మిజోరాం రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. 2024 లోకసభ ఎన్నికల ముందు వస్తున్న అసెంబ్లీ ఎన్నికలు కావడంతో అందరి దృష్టి వీటిపై కేంద్రీకృతమయ్యాయి.
ఇదిలా ఉంటే ప్రజల్ని ఆకట్టుకునేందుకు, వార్తల్లో ఉండేందుకు కొంతమంది అభ్యర్థులు వినూత్నంగా వ్యవహరిస్తున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనామినేషన్ల దాఖలుకు మరికొన్ని రోజులే మిగి ఉంటటంతో అభ్యర్థుల హడావుడి ప్రారంభమైూంది. అయితే కొందరు అభ్యర్థులు మాత్రం నామినేషన్ సెంటర్లకు చేరుకోవడానికి కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు.
Also Read

Read Also: Qatar: 8 మంది భారత మాజీ నేవీ అధికారులకు ఉరిశిక్ష.. ప్లాన్ ప్రకారమే ఇరికించిన పాకిస్తాన్, ఖతార్.?
మధ్యప్రదేశ్ బుర్హాన్ పూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్న ప్రియాంక్ ఠాకూర్ నామినేషన్ సమర్పించేందుకు ‘గాడిద’పై ఎన్నికల కార్యాలయానికి వెళ్లారు. అన్ని రాజకీయ పార్టీలు ఆశ్రిత పక్షపాతానికి గురవుతున్నాయి, ప్రజలను గాడిదలుగా మారుస్తున్నారని సింబాలిక్ గా చెప్పేందుకు ఇలా నామినేషన్ వేశానని చెప్పారు. ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి సురేంద్ర సింగ్ షేరా భయ్యా ఎద్దుల బండిపై వచ్చి నామినేషన్ వేశారు.
సాన్వేర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి రీన బోరాసి సాన్వెర్ ట్రాక్టర్ పై వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. నరేలా అసెంబ్లీకి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి విశ్వాస్ సారంగ్ స్కూటర్ పై వచ్చి నామినేషన్ వేశారు. మధ్యప్రదేశ్‌లో నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ అక్టోబర్ 30, పరిశీలన అక్టోబర్ 31న జరుగుతుంది. అభ్యర్థిత్వ ఉపసంహరణకు నవంబర్ 2 చివరి తేదీ. 230 మంది సభ్యులున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీకి నవంబర్ 17న ఎన్నికలు జరగనున్నాయి.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్‌కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!