NTV Telugu Site icon

5 States Elections: గాడిదపై వచ్చి నామినేషన్.. ఎన్నికల సిత్రాలు..

Mp

Mp

5 States Elections: 5 రాష్ట్రాల ఎన్నికలకు కొన్ని రోజులే సమయం ఉంది. వచ్చే నెలలో తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గడ్, మిజోరాం రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. 2024 లోకసభ ఎన్నికల ముందు వస్తున్న అసెంబ్లీ ఎన్నికలు కావడంతో అందరి దృష్టి వీటిపై కేంద్రీకృతమయ్యాయి.

ఇదిలా ఉంటే ప్రజల్ని ఆకట్టుకునేందుకు, వార్తల్లో ఉండేందుకు కొంతమంది అభ్యర్థులు వినూత్నంగా వ్యవహరిస్తున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనామినేషన్ల దాఖలుకు మరికొన్ని రోజులే మిగి ఉంటటంతో అభ్యర్థుల హడావుడి ప్రారంభమైూంది. అయితే కొందరు అభ్యర్థులు మాత్రం నామినేషన్ సెంటర్లకు చేరుకోవడానికి కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు.

Read Also: Qatar: 8 మంది భారత మాజీ నేవీ అధికారులకు ఉరిశిక్ష.. ప్లాన్ ప్రకారమే ఇరికించిన పాకిస్తాన్, ఖతార్.?

మధ్యప్రదేశ్ బుర్హాన్ పూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్న ప్రియాంక్ ఠాకూర్ నామినేషన్ సమర్పించేందుకు ‘గాడిద’పై ఎన్నికల కార్యాలయానికి వెళ్లారు. అన్ని రాజకీయ పార్టీలు ఆశ్రిత పక్షపాతానికి గురవుతున్నాయి, ప్రజలను గాడిదలుగా మారుస్తున్నారని సింబాలిక్ గా చెప్పేందుకు ఇలా నామినేషన్ వేశానని చెప్పారు. ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి సురేంద్ర సింగ్ షేరా భయ్యా ఎద్దుల బండిపై వచ్చి నామినేషన్ వేశారు.

సాన్వేర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి రీన బోరాసి సాన్వెర్ ట్రాక్టర్ పై వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. నరేలా అసెంబ్లీకి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి విశ్వాస్ సారంగ్ స్కూటర్ పై వచ్చి నామినేషన్ వేశారు. మధ్యప్రదేశ్‌లో నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ అక్టోబర్ 30, పరిశీలన అక్టోబర్ 31న జరుగుతుంది. అభ్యర్థిత్వ ఉపసంహరణకు నవంబర్ 2 చివరి తేదీ. 230 మంది సభ్యులున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీకి నవంబర్ 17న ఎన్నికలు జరగనున్నాయి.

Show comments