NTV Telugu Site icon

Canada: “1984 సిక్కు మారణహోమానికి” అధికార గుర్తింపు కోరిన సిక్కు ఎంపీ..

Jagmit Singh

Jagmit Singh

Canada: కెనడాలో ప్రధాని జస్టిన్ ట్రూడో పార్టీలో అధికార అవగాహన కుదుర్చుకున్న కెనడా న్యూ డెమోక్రటిక్ పార్టీ (ఎన్డీపీ) ‘‘ 1984 సిక్కు మారణహోమాన్ని’’ అధికారి గుర్తింపు కోరింది. ఇది క్రూరమైన ప్రభుత్వ ప్రత్యక్ష దాడిగా అభివర్ణించింది. ఈ ఘటన జరిగి 40 ఏళ్లు కావస్తున్న సమయంలో ఎన్డీపీ ఎంపీ జగ్మీత్ సింగ్ ఈ ప్రతిపాదన చేశారు. కెనడా పార్లమెంట్లో ఆయన ఈ ఘటనపై అధికారి గుర్తింపు కోరుతారని ఎన్డీపీ ప్రచారంలో పేర్కొన్నారు. శనివారం బ్రిటీష్ కొలంబియాలోని సర్రేలో జరిగిన వైశాఖి పరేడ్‌లో పాల్గొన్న జగ్మిత్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘సిక్కు మారణహోమం యొక్క 40వ వార్షికోత్సవం వస్తోంది. ఈ సందర్భంగా సిక్కు మారణహోమాన్ని సమాఖ్య స్థాయిలో గుర్తించాలి’’ అని అన్నారు.

Read Also: Neha murder Case: నేహ హిరేమత్ హత్య భయంతో.. ముస్లిం యువకుడితో స్నేహానికి స్వస్తి చెప్పిన యువతిపై దాడి..

‘‘ఈ రాష్ట్ర-వ్యవస్థీకృత హత్యాకాండను జెనోసైడ్‌గా గుర్తించాలని మేము కెనడా ప్రభుత్వాన్ని కోరుతున్నాము’’ అని జగ్మిత్ సింగ్ పేర్కొన్నారు. మాజీ ప్రధాని, దివంగత ఇందిరాగాంధీ హత్య అక్టోబర్ 1984లో చోటు చేసుకున్న తర్వాత సిక్కుల హత్యలు చోటు చేసుకున్నాయి. దీనినే కొందరు సిక్కుల ఊచకోతగా అభివర్ణిస్తున్నారు. ఏప్రిల్ 2017లో అంటారియో శాసనసభ ఇలాంటి తీర్మానాన్ని ఆమోదించింది. అయితే, ఇది భారత్- కెనడాల మధ్య విభేదాలకు కారణమైంది. అంటారియా శాసనసభ్యుడిగా ఉన్న లిబరల్ పార్టీకి చెందిన హరీందర్ మల్హీ ఈ తీర్మానాన్ని తీసుకువచ్చారు.

వేర్పాటువాద సంస్థ, భారత్‌లో ఉగ్రవాద సంస్థగా గుర్తింపుపొందిన సిక్కులు ఫర్ జస్టిస్ (SFJ) స్పందిస్తూ.. ఇది సానుకూలదశగా పేర్కొంది. ఇప్పటికే ఖలిస్తాన్ రెఫరెండంతో ఈ సంస్థ భారత్‌లో విభజనను ప్రోత్సహిస్తోంది. ఇదే డిమాండ్ చేస్తున్న ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్(KTF) చీఫ్ హర్దీప్ సింగ్ నిజ్జర్ గతేడాది హత్యకు గురయ్యాడు. ఈ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉన్నట్లు ఏకంగా ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడం ఇరు దేశాల మధ్య దౌత్య ఉద్రిక్తతలకు దారి తీసింది. మరోవైపు మరో ఖలిస్తానీ ఉగ్రవాది ఎస్‌జేఎఫ్ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూను భారత్‌కి చెందిన ఓ వ్యక్తి చంపేందుకు కుట్ర పన్నినట్లు అమెరికా ఆరోపిస్తోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని చెక్ రిపబ్లిక్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఇతడిని అమెరికా తీసుకువచ్చేందుకు ఆ దేశంతో చర్చలు జరుపుతున్నారు.