NTV Telugu Site icon

India-Canada Issue: ఖలిస్తానీ తీవ్రవాదానికి పాకిస్తాన్ మద్దతు..కెనడా ఇంటెలిజెన్స్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..

India, Canada

India, Canada

India-Canada Issue: భారత్, కెనడాల మధ్య ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వివాదంగా మారింది. గతేడాది నిజ్జర్‌ని కొందరు వ్యక్తులు కాల్చి చంపారు. అయితే, ఈ హత్యలో భారత్ ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో అక్కడి పార్లమెంట్‌లో ఆరోపించడంతో వివాదం చెలరేగింది. ఇదిలా ఉంటే, తాజాగా ఈ కేసులో భారత దౌత్యవేత్తల ప్రమేయం ఉందని, వారే ప్రధాని మోడీకి వ్యతిరేకంగా మాట్లాడే వారి వివరాలను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కి ఇస్తున్నారంటూ కెనడా ప్రభుత్వం ఆరోపించింది.

అయితే, వీటన్నింటికి గట్టి ఆధారాలు లేవని చెబుతోంది. గతంలో చాలా సార్లు ఈ ఆరోపణకు ఆధారాలు ఇవ్వాలని భారత్ కోరినా, కెనడా నుంచి ఎలాంటి ఆధారాలు రాలేదు. ప్రస్తుతం భారత్ కెనడా నుంచి తన రాయబారుల్ని ఉపసంహరించుకోవడంతో పాటు భారత్‌లోని కెనడా రాయబారుల్ని దేశం వదిలి వెళ్లాలని ఆదేశించింది.

Read Also: YS Jagan: నెల రోజుల్లో ఇసుకను దోచేశారు.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు

ఇదిలా ఉంటే, తాజా వివాదం మధ్య కెనడా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్(CSIS) తాత్కాలిక డైరెక్టర్ వెనెస్సా లాయిడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కెనడాలో ఖలిస్తానీ తీవ్రవాదాన్ని ప్రోత్సహించేందుకు పాకిస్తాన్ ప్రముఖ పాత్ర వహిస్తోందని అన్నారు. కెనడాలో భారత్ ప్రమేయాన్ని తగ్గించేందుకు పాకిస్తాన్ ఖలిస్తానీ తీవ్రవాదానికి నేరుగా మద్దతు ఇస్తోందని ఆమె అన్నారు. ఆమె వ్యాఖ్యలు ఖలిస్తాన్ తీవ్రవాదానికి పాకిస్తాన్ మద్దతు ఉందనే విషయాన్ని బహిర్గతం చేసింది.

ప్రధాని జస్టిన్ ట్రూడో నేతృత్వంలోని కెనడా ప్రభుత్వం భారత్‌పై విమర్శలు తీవ్రతరం చేసిన తరుణంలో ఈ ప్రకటన వెలువడింది. సెప్టెంబరులో ఫారిన్ ఇంటర్‌ఫరెన్స్ కమీషన్ ముందు హాజరైన సమయంలో ఆమె పాకిస్తాన్ ప్రమేయం గురించి నిజాయితీగా వెల్లడించారు. భారతదేశ ఉనికిని ఎదుర్కోవడానికి ఖలిస్తానీలకు పాకిస్తాన్ సహకరిస్తుందని ఆమె చెప్పారు.

Show comments