Site icon NTV Telugu

PM Modi: రేపు మోడీ అధ్యక్షతన కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్

Mdoi5

Mdoi5

ప్రధాని మోడీ అధ్యక్షతన బుధవారం మంత్రివర్గ సమావేశం కానుంది. రేపు సాయంత్రం 5:30 గంటలకు కేబినెట్ సమావేశం కానుంది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం మోడీ భూటాన్ పర్యటనలో ఉన్నారు. రేపు తిరిగి ఢిల్లీకి చేరుకోనున్నారు.

ఇది కూడా చదవండి: Delhi Car Blast: ఢిల్లీ పేలుళ్ల సూత్రధారి ఉమర్‌ మహ్మద్‌.. సహచరులతో కలిసి మాస్టర్ ప్లాన్!

ఇదిలా ఉంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన మంగళవారం కీలక సమావేశం జరుగుతోంది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యాలయంలో ఈ భేటీ ప్రారంభమైంది. హోం కార్యదర్శి గోవింద్ మోహన్, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్, జాతీయ దర్యాప్తు సంస్థ డైరెక్టర్ జనరల్, ఢిల్లీ పోలీస్ కమిషనర్, ఇతర సీనియర్ అధికారులు హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జమ్మూ కాశ్మీర్ డీజీపీ, కేంద్ర పాలిత ప్రాంతం ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఢిల్లీ పేలుడుపై ప్రాథమికంగా అందిన సమాచారం, ఉగ్ర సంస్థల ప్రమేయం, భారీ కుట్రపై సమీక్షిస్తున్నారు.

ఇది కూడా చదవండి: PM Modi: ఉత్సాహంగా ఓటేసి.. కొత్త రికార్డ్‌ను సృష్టించండి.. బీహారీయులకు మోడీ పిలుపు

సోమవారం సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ పార్కింగ్ స్థలం దగ్గర పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 9 మంది చనిపోయారు. అనేక మంది గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం దర్యాప్తు సంస్థలు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఇక నిందితుడికి సంబంధించిన వీడియోలు కూడా వెలుగులోకి వచ్చాయి.

Exit mobile version