Site icon NTV Telugu

Central Cabinet Decisions: కీలక నిర్ణయాలు తీసుకున్న కేబినెట్.. ఏవేవంటే..!

Centralcabinet

Centralcabinet

కేంద్ర కేబినెట్ బుధవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధాని మోడీ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం అయింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Anushree Satyanarayana: ఆ నలుగురు వీరే.. దిల్ రాజుపై కోర్టుకు వెళ్తా!

ఖరీఫ్ పంటలకు రూ.2లక్షల కోట్లకు పైగా ఎంఎస్‌పీని ప్రకటించింది. ఈ ఏడాది 8 రోజులు ముందుగానే రుతుపవనాలు భారత్‌లోకి ప్రవేశించాయి. అలాగే ఈ సంవత్సరం  విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ముందుగానే సమాచారం అందించింది. ఈ నేపథ్యంలో అన్నదాతలకు మేలు చేకూర్చేలా మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఖరీఫ్ పంటకు మద్దతు ధర కోసం రూ.2,07,000 కోట్ల రూపాయలు కేటాయించింది.

ఇది కూడా చదవండి: Cinema Theatre Inspections: ఏపీ వ్యాప్తంగా థియేటర్లలో కొనసాగుతున్న తనిఖీలు

అలాగే రైతు సంక్షేమం కోసం ఇంట్రెస్ట్ సబ్వేషన్స్ స్కీమ్ కూడా ప్రకటించింది. ఇక బద్వేలు- నెల్లూరు హైవే 4 లైన్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే వార్డా బళ్లార్ష హైవే 4 లైన్ల నిర్మాణం, రత్లాం నాగాడా హైవే నాలుగు లైన్ల నిర్మాణానికి కేంద్రం శ్రీకారం చుట్టింది.

2025-26 ఖరీఫ్ సీజన్ కోసం 14 ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరలను (MSP) కేంద్ర కేబినెట్ ఆమోదించింది.

వరి సాధారణ, గ్రేడ్-ఏ కి క్వింటాలు రూ.69 పెంపు
జొన్నలు క్వింటా రూ. 328 పెంపు
సజ్జలు క్వింటా రూ.150 పెంపు
రాగులు క్వింటా రూ.596 పెంపు
మొక్కజొన్న క్వింటా రూ.175 పెంపు
కందిపప్పు క్వింటా రూ.450 పెంపు
పెసర్లు క్వింటా రూ.86పెంపు
మినుములు క్వింటా రూ.400 పెంపు
వేరుసెనగ క్వింటా రూ.480 పెంపు
పొద్దుతిరుగు క్వింటా రూ.441 పెంపు
సోయాబీన్ క్వింటా రూ.436 పెంపు
కుసుములు క్వింటా రూ.579 పెంపు
ఒలిసెలు క్వింటా రూ.820 పెంపు
పత్తి క్వింటా రూ.589 పెంపు
సగటు ఉత్పత్తి వ్యయంపై ఒకటిన్నర రెట్లు మద్దతు ధర నిర్ణయం

 

Exit mobile version