Semiconductor Plants: దేశంలో 3 సెమీకండక్టర్ ప్లాంట్లకు క్యాబినెట్ ఆమోదం.. పెట్టుబడి విలువ రూ. 1.26 లక్షల కోట్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Semiconductor Plants: ఎలక్ట్రాన్సిక్స్, ఆటోమొబైల్ రంగంతో పాటు శాస్త్రసాంకేతిక రంగంలో ఎంతో కీలకమైన సెమీకండక్టర్ తయారీలో భారత్ స్వయం సమృద్ధి సాధించేందుకు ప్రయత్నిస్తోంది. చైనా, తైవాన్ వంటి దేశాల గుత్తాధిపత్యం నుంచి బయటపడేందుకు కేంద్ర ప్రభుత్వం భారత్‌లోనే చిప్ తయారీని ప్రోత్సహిస్తోంది. ఈ మేరకు భారతదేశంలో మూడు సెమీకండక్టర్ల ప్లాంట్లనను ఏర్పాటు చేసేందుకు కేంద్ర క్యాబినెట్ గురువారం పచ్చజెండా ఊపింది. ఈ విషయాన్ని ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం ప్రకటించారు. రానున్న 100 రోజుల్లో నిర్మాణాలు ప్రారంభిస్తామని చెప్పారు.
ప్రధాని నరేంద్రమోడీ సెమీకండక్టర్ ఫ్యాబ్‌ను ఏర్పాటు చేయడానికి ఈ రోజు ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకున్నారని, మొదటి కమర్షియల్ సెమీకండక్టర్ ఫ్యాబ్‌ని టాటా-పవర్ చిప్ తైవాన్ ఏర్పాటు చేస్తుందని అశ్విణి వైష్ణవ్ తెలిపారు. దీని ప్లాంట్ గుజరాత్‌లోని ధోలేరాలో ఉంటుంది. టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్, పవర్‌చిప్ సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ కార్ప్‌తో కలిసి గుజరాత్‌లోని ధోలేరాలో సెమీకండక్టర్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనుంది.
Also Read
- Satyagraha: రాహుల్ గాంధీ కొత్త అస్త్రం .. ఒంటరిగా పోరాడొద్దు.. తోడుగా నేనుంటా!
- Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
- SH-93 Hindi Signboard Row: SH-93 హైవే బోర్డుపై హిందీ అక్షరాలు.. ఇద్దరు అధికారులు సస్పెండ్
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
Read Also: Gaza War: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంలో 30,000 దాటిన మృతుల సంఖ్య…
రూ. 27,000 కోట్లతో అస్సాంలోని మోరిగావ్‌లో టాటా సెమీకండక్టర్ అసెంబ్లీ, టెస్ట్ ప్రైవేట్ లిమిటెడ్‌ని ఏర్పాటు చేస్తుంది. CG పవర్, జపాన్‌కు చెందిన రెనెసాస్ ఎలక్ట్రానిక్స్ కార్ప్ మరియు థాయ్‌లాండ్‌కు చెందిన స్టార్స్ మైక్రోఎలక్ట్రానిక్స్ భాగస్వామ్యంతో గుజరాత్‌ని సనంద్ లో మరో సెమీకండక్టర్ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నారు.
ఈ మూడు ప్లాంట్ల మొత్తం పెట్టుబడి రూ. 1.26 లక్షల కోట్లు. ఈ మూడు కలిసి ఏడాదికి దాదాపుగా 3 బిలియన్ చిప్‌లను తయారు చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. గుజరాత్ ధోలేరాలోని సెమీకండక్టర్ ఫ్యాబ్ పెట్టుబడి రూ. 91,000 కోట్లు కాగా.. అస్సాంలోని టాటా యొక్క సెమీకండక్టర్ ప్యాకేజింగ్ ప్లాంట్ – 27,000 కోట్లు, గుజరాత్ సనంద్‌లోని సీజీ పవర్ ప్లాంట్ పెట్టుబడి రూ. 7600 కోట్లు.
తాజావార్తలు
-
Aishwarya Lekshmi: బన్నీ – అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
-
Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
-
Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
-
Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!