NTV Telugu Site icon

Business Ideas: గోధుమ రవ్వ, చింతపండుతో ప్లేట్లు, గ్లాసులు.. లక్షల్లో ఆదాయం..

bussiness idea

bussiness idea

ప్లాస్టిక్ వస్తువులు పర్యావరణాన్ని ఎంతగా కాలుష్యం చేస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ప్లాస్టిక్ ను వీలైనంత వరకూ తగ్గించాలని ప్రపంచంలోని అన్ని దేశాలు తగిన కార్యాచరణతో ముందుకెళ్తున్నాయి. మన దేశంలో కూడా ప్లాస్టిక్ వినియోగం చాలా ఎక్కువ. అయితే ఈ సవాలును అధిగమించేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలను తీసుకుంటున్నాయి. ముఖ్యంగా ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసుల స్థానంలో పేపర్ గ్లాసులను వినియోగించేలా ప్రోత్సహిస్తున్నారు. అలాగే పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు అందుకు పర్యావరణ హితమైన వస్తువును వినియోగించేందుకు జనాలకు కూడా మొగ్గుచూపుతున్నారు..

ఈక్రమంలో ఎకో ఫ్రెండ్లి ఉత్పత్తులకు మార్కెట్ లో రోజూ రోజుకు డిమాండ్ పెరుగుతుంది. దీని గురించి ఆలోచించిన ఓ వ్యక్తి దాన్నే బిజినెస్ గా మార్చుకున్నాడు.. ఇప్పుడు లక్షల్లో డబ్బులను సంపాదిస్తూ సక్సెస్ అయ్యాడు.. ఆ యువకుడు ఎవరు? అతను చేసిన బిజినెస్ ఏమిటి? పెట్టుబడి ఎంత? లాభాలు ఎలా వచ్చాయి? వివరంగా తెలుసుకుందాం..

తమిళనాడులోని కోయంబత్తూర్ కు చెందిన కళ్యాణ్ కుమార్ అనే యువకుడు ప్లాస్టిక్‌ను నివారించాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం వ్యర్థ పదార్థాలతోవస్తువులను తయారు చేయాలని ప్రణాళిక చేశాడు. వినియోగించిన తర్వాత కూడా వాటిని ఏదో ఒకరకంగా వాడేలా వాటిని తయారు చేయాలనుకొన్నాడు. అందుకోసం ఓ వినూత్న ఆలోచన చేశాడు.. గోధుమ రవ్వ , ధాన్యం పొట్టు, చింతపండు, పప్పులు, అరటి తొక్క, వివిధ ధాన్యం గింజలతో ఉపయోగకరమైన వస్తువులను తయారు చేయాలని తలంచాడు. అందుకోసం ఓ ప్రత్యేకమైన యంత్రాన్ని తయారు చేశాడు. దాని సాయంతో టీ కప్పులు, ప్లేట్లు, స్పూన్లు, డిన్నర్ ప్లేట్లు తయారు చేశాడు.గోధుమ రవ్వ , ధాన్యం పొట్టు, చింతపండు, పప్పులు, అరటి తొక్క, వివిధ ధాన్యం గింజలతో ఉపయోగకరమైన వస్తువులను తయారు చేయాలని తలంచాడు. అందుకోసం ఓ ప్రత్యేకమైన యంత్రాన్ని తయారు చేశాడు. ఈ యంత్రం సాయంతో టీ కప్పులు, ప్లేట్లు, స్పూన్లు, డిన్నర్ ప్లేట్లు తయారు చేశాడు.. ఇలాంటి వాటికి మంచి డిమాండ్ కూడా ఎక్కువే..

ఇక తాను తయారు చేసిన యంత్రం వివిధ పరిమాణాల్లో అందుబాటులో ఉంటుందని చెబుతున్నారు. రూ. 3 లక్షల నుంచి రూ. 35లక్షల వరకూ ఉంటుందన్నారు. రూ. 3 లక్షల విలువైన ఒక చిన్న యంత్రం కూడా రోజుకు 1000 కప్పులను తయారు చేయగలదని కళ్యాణ్ చెప్పారు. అందుకోసం కాస్త శ్రద్ధ పెట్టాలన్నారు. కానీ 35 లక్షల విలువైన పెద్ద యంత్రం పూర్తిగా ఆటోమేటిక్ అని దీనిలో శ్రమ తక్కువని వివరించారు. తానూ ప్రస్తుతం రోజూ 10 లక్షల కప్పులు అమ్ముతున్నట్లు వెల్లడించారు.. తాను తయారు చేస్తున్న ఈ వస్తువులు పర్యావరణానికి మేలు చేస్తాయని నిపుణులు, ప్రస్తుతం తాను కొందరికి వీటి గురించి నేర్పిస్తున్నట్లు తెలిపారు.. త్వరలోనే తన వస్తువులను ప్రపంచ వ్యాప్తంగా చెయ్యాలని అనుకుంటున్నట్లు భావిస్తున్నారు..

Show comments