Business Ideas: గోధుమ రవ్వ, చింతపండుతో ప్లేట్లు, గ్లాసులు.. లక్షల్లో ఆదాయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్లాస్టిక్ వస్తువులు పర్యావరణాన్ని ఎంతగా కాలుష్యం చేస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ప్లాస్టిక్ ను వీలైనంత వరకూ తగ్గించాలని ప్రపంచంలోని అన్ని దేశాలు తగిన కార్యాచరణతో ముందుకెళ్తున్నాయి. మన దేశంలో కూడా ప్లాస్టిక్ వినియోగం చాలా ఎక్కువ. అయితే ఈ సవాలును అధిగమించేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలను తీసుకుంటున్నాయి. ముఖ్యంగా ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసుల స్థానంలో పేపర్ గ్లాసులను వినియోగించేలా ప్రోత్సహిస్తున్నారు. అలాగే పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు అందుకు పర్యావరణ హితమైన వస్తువును వినియోగించేందుకు జనాలకు కూడా మొగ్గుచూపుతున్నారు..
ఈక్రమంలో ఎకో ఫ్రెండ్లి ఉత్పత్తులకు మార్కెట్ లో రోజూ రోజుకు డిమాండ్ పెరుగుతుంది. దీని గురించి ఆలోచించిన ఓ వ్యక్తి దాన్నే బిజినెస్ గా మార్చుకున్నాడు.. ఇప్పుడు లక్షల్లో డబ్బులను సంపాదిస్తూ సక్సెస్ అయ్యాడు.. ఆ యువకుడు ఎవరు? అతను చేసిన బిజినెస్ ఏమిటి? పెట్టుబడి ఎంత? లాభాలు ఎలా వచ్చాయి? వివరంగా తెలుసుకుందాం..
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
తమిళనాడులోని కోయంబత్తూర్ కు చెందిన కళ్యాణ్ కుమార్ అనే యువకుడు ప్లాస్టిక్‌ను నివారించాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం వ్యర్థ పదార్థాలతోవస్తువులను తయారు చేయాలని ప్రణాళిక చేశాడు. వినియోగించిన తర్వాత కూడా వాటిని ఏదో ఒకరకంగా వాడేలా వాటిని తయారు చేయాలనుకొన్నాడు. అందుకోసం ఓ వినూత్న ఆలోచన చేశాడు.. గోధుమ రవ్వ , ధాన్యం పొట్టు, చింతపండు, పప్పులు, అరటి తొక్క, వివిధ ధాన్యం గింజలతో ఉపయోగకరమైన వస్తువులను తయారు చేయాలని తలంచాడు. అందుకోసం ఓ ప్రత్యేకమైన యంత్రాన్ని తయారు చేశాడు. దాని సాయంతో టీ కప్పులు, ప్లేట్లు, స్పూన్లు, డిన్నర్ ప్లేట్లు తయారు చేశాడు.గోధుమ రవ్వ , ధాన్యం పొట్టు, చింతపండు, పప్పులు, అరటి తొక్క, వివిధ ధాన్యం గింజలతో ఉపయోగకరమైన వస్తువులను తయారు చేయాలని తలంచాడు. అందుకోసం ఓ ప్రత్యేకమైన యంత్రాన్ని తయారు చేశాడు. ఈ యంత్రం సాయంతో టీ కప్పులు, ప్లేట్లు, స్పూన్లు, డిన్నర్ ప్లేట్లు తయారు చేశాడు.. ఇలాంటి వాటికి మంచి డిమాండ్ కూడా ఎక్కువే..
ఇక తాను తయారు చేసిన యంత్రం వివిధ పరిమాణాల్లో అందుబాటులో ఉంటుందని చెబుతున్నారు. రూ. 3 లక్షల నుంచి రూ. 35లక్షల వరకూ ఉంటుందన్నారు. రూ. 3 లక్షల విలువైన ఒక చిన్న యంత్రం కూడా రోజుకు 1000 కప్పులను తయారు చేయగలదని కళ్యాణ్ చెప్పారు. అందుకోసం కాస్త శ్రద్ధ పెట్టాలన్నారు. కానీ 35 లక్షల విలువైన పెద్ద యంత్రం పూర్తిగా ఆటోమేటిక్ అని దీనిలో శ్రమ తక్కువని వివరించారు. తానూ ప్రస్తుతం రోజూ 10 లక్షల కప్పులు అమ్ముతున్నట్లు వెల్లడించారు.. తాను తయారు చేస్తున్న ఈ వస్తువులు పర్యావరణానికి మేలు చేస్తాయని నిపుణులు, ప్రస్తుతం తాను కొందరికి వీటి గురించి నేర్పిస్తున్నట్లు తెలిపారు.. త్వరలోనే తన వస్తువులను ప్రపంచ వ్యాప్తంగా చెయ్యాలని అనుకుంటున్నట్లు భావిస్తున్నారు..
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..