Bus Conductor Refuses To Return Rs 1 Change To Passenger: తమ వద్ద చిల్లర ఉన్నప్పటికీ.. కొందరు బస్ కండక్టర్లు చిల్లర లేదని చెప్తుంటారు. మరికొందరైతే.. బస్సు దిగేటప్పుడు చిల్లర తీసుకోవాలని చెప్పి, టికెట్ వెనకాల రాసిస్తారు. అయితే.. ఒకట్రెండు రూపాయలే కదా అని, చాలామంది కండక్టర్ వద్ద నుంచి చిల్లర తీసుకోకుండా వెళ్లిపోతారు. ఇంకొందరైతే.. బస్సు దిగే తొందరలో చిల్లర తీసుకోవడం మర్చిపోతారు. కానీ.. కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి మాత్రం అలా చేయలేదు. తనకు కండక్టర్ ఒక్క రూపాయి తిరిగి ఇవ్వలేదని, ఏకంగా కోర్టుకెక్కాడు. చివరికి విజయం సాధించి.. అందరికీ ఆదర్శంగా నిలవడంతో పాటు ప్రయాణికుడి హక్కు గురించి అవగాహన కల్పించాడు. ఆ వివరాల్లోకి వెళ్తే..
Russia: రష్యా అధ్యక్షుడి షాకింగ్ ప్రకటన.. అమెరికాతో అణు ఒప్పందానికి బ్రేక్
2019లో రమేశ్ నాయక్ అనే వ్యక్తి బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టు కార్పోరేషన్(బీఎంటీసీ) బస్సు ఎక్కాడు. శాంతి నగర్ నుంచి మజెస్టిక్ బస్ డిపో వరకు టికెట్ తీసుకున్నాడు. టికెట్ ధర రూ. 29 కావడంతో.. అతడు కండక్టర్‌కు రూ.30 ఇచ్చాడు. అయితే.. కండక్టర్ అతనికి ఒక్క రూపాయి తిరిగి ఇవ్వలేదు. చిల్లర ఇవ్వకుండానే వెళ్తుండటంతో.. తన రూపాయి తిరిగి ఇవ్వాలని అడిగాడు. ఇందుకు ఆ కండక్టర్ ‘నా వద్ద చిల్లర లేదు’ అంటూ గట్టిగా అరిచాడు. కండక్టర్ తీరు చూసి ఖంగుతిన్న రమేశ్.. అతనిపై బీఎంటీసీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అయితే.. వాళ్లు ఈ ఫిర్యాదుని సీరియస్‌గా తీసుకోలేదు. తాను ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కకపోవడంతో.. రమేశ్ జిల్లా వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు. తన రూపాయి తిరిగి ఇవ్వకుండా నానా ఇబ్బందులు పెట్టారని, ఇందుకు రూ.15వేలు పరిహారంగా ఇప్పించాలని కోరాడు.
KL Rahul: కేఎల్ రాహుల్‌కి మరో బిగ్ షాక్.. స్థానం పోయినట్టే?
ఈ కేసుని పరిశీలించిన న్యాయస్థానం.. బీఎంటీసీకి షాక్ ఇస్తూ, రమేశ్‌కి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. రమేశ్‌కు రూ.2,000 పరిహారంగా చెల్లించడంతో పాటు న్యాయప్రక్రియకు అయిన ఖర్చుకి గాను మరో రూ.1,000 చెల్లించాలని ఆదేశించింది. ఒకవేళ 45 రోజుల్లోగా పరిహారం ఇవ్వకపోతే.. ఏటా రూ.6,000 వడ్డీ కింద చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ వ్యవహారంలో బీఎంటీసీ కౌంటర్ పిటిషన్ దాఖలు చేయగా.. దాన్ని న్యాయస్థానం తోసిపుచ్చింది. ఇది ఒక్క రూపాయి చిల్లర విషయం గురించి మాత్రమే కాదని, వినియోగదారుడి హక్కు అంశమని స్పష్టం చేసింది. కండక్టర్ ప్రవర్తించిన తీరును తప్పుబట్టిన కోర్టు.. నష్టపరిహారం రమేశ్‌కి చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పింది.