Site icon NTV Telugu

ఢిల్లీ-అయోధ్య మధ్య బుల్లెట్ ట్రైన్‌… గంట‌కు…

యూపీలోని అయోధ్యలో రామాల‌యం నిర్మాణం వేగంగా జ‌రుగుతున్న‌ది.  2023 నాటికి ఆల‌య నిర్మాణం పూర్తిచేయాల‌ని ట్ర‌స్ట్ ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ది.  అయోధ్య‌లో ఉన్న మ‌ర్యాద పురుషోత్త‌మ శ్రీరామ‌చంద్ర ఎయిర్‌పోర్టుకు స‌మీపంలో కేంద్రం బుల్లెట్ ట్రైన్ స్టేష‌న్‌ను నిర్మించ‌బోతున్నారు.  ఇక్క‌డి నుంచి ఢిల్లీకి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు కేంద్రం సిద్ధం అవుతున్నది.  ఈ ప్రాజెక్టు బాధ్య‌త‌ల‌ను నేష‌న‌ల్ హైస్పీడ్ రైల్ కార్పోరేష‌న్‌కు అప్ప‌గించారు.  ఈ సంస్థ అధికారులు ఇటీవ‌లే ఆయోధ్య‌వెళ్లి అక్క‌డ స్థ‌లాన్ని ప‌రిశీలించి ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌లు జ‌రిపారు.  రైల్వే స్టేష‌న్ కోసం యూపీ ప్ర‌భుత్వం అనుమ‌తులు మంజూరు చేసింది.  ఇక‌, ఎయిర్ పోర్ట్ నుంచి నో అబ్జెక్ష‌న్ స‌ర్టిఫికెట్ రావాల్సి ఉన్న‌ది.  ఢిల్లీ నుంచి ఈ బుల్లెట్ ట్రైన్ వార‌ణాసి, ప్ర‌యాగ‌లు మీదుగా అయోధ్య‌ను చేరుతుంది.  మొత్తం 941.5 కిలోమీట‌ర్ల మేర ఈ రైలు మార్గాన్ని నిర్మించ‌బోతున్నారు.  ఈ ప్రాజెక్ట్ పూరైతే గంట‌కు 350 కిలోమీట‌ర్ల వేగంతో  ఈ మార్గం గుండా బుల్లెట్ ట్రైన్ ప‌రుగులు తీస్తుంది.  ఒక ట్రైన్ ఢిల్లీ-అయోధ్య మ‌ధ్య ప‌రుగులు తీస్తే, మ‌రోక ట్రైన్ ను ఢిల్లీ వార‌ణాసిల‌కు న‌డ‌పాల‌ని అధికారులు నిర్ణ‌యం తీసుకున్నారు.  భ‌విష్య‌త్తులో రద్ధీని బ‌ట్టి మ‌రిన్ని ట్రైన్‌ను ఈ మార్గంలో అందుబాటులోకి తెచ్చే అవ‌కాశం ఉంటుంది.  

Read: వైర‌ల్‌: ఒక జింక కోసం ఆరు సింహాల ఫైట్‌… చివ‌ర‌కు…

Exit mobile version