Bulk drug park for Telangana: తెలంగాణలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయాలని లోక్ సభలో బీఆర్‌ఎస్ ఎంపీ నామ నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. దీంతో.. తెలంగాణకు బల్క్ డ్రగ్స్ పార్కు మంజూరు చేసినట్లు కేంద్ర వైద్య శాఖ మంత్రి మన్సుక్ మాండవియా వెల్లడించారు. 12వేలకు వైగా దేశంలో ఫార్మ కంపెనీలు ఉన్నాయని, బల్క్ డ్రగ్స్ ను దేశంలోని ఉత్పత్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పీ.ఎస్.ఐ స్కీంలో దేశంలో మూడు చోట్ల బల్క్ ట్రక్ పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఒక్కో పార్కు 1000 కోట్ల రూపాయల నిధులు ఇస్తున్నామని తెలిపారు. 13 రాష్ట్రాల నుంచి మాకు దరఖాస్తులు వచ్చాయని, తెలంగాణలో బల్క్ డ్రగ్స్ పార్కు కు ఆమోదం తెలిపామన్నారు.
Read also: Minister KTR: డియర్ పూరీ జీ.. అలాచేస్తే పెట్రోల్, డీజల్ రూ.70, 60కే ఇవ్వొచ్చు
ఈ పార్క్ ఏర్పాటుకు వెయ్యి కోట్ల రూపాయలు ఇస్తున్నామని లోక్‌సభలో వెల్లడించారు. గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ లో కూడా బల్క్ డ్రగ్స్ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అయితే.. 2022 సెప్టెంబర్ 1న బల్క్ డ్రగ్ పార్క్ కోసం తెలంగాణ చేసిన విన్నపాలను పక్కన పడేసింది. వరల్డ్ వ్యాక్సిన్ క్యాపిటల్‌గా పేరున్న హైదరాబాద్‌లో కాదని, మరోసారి గుజరాత్ మీద వరాలు కురిపించింది. బల్క్ డ్రగ్ పార్క్ కావాలని తెలంగాణతోపాటు తమిళనాడు సైతం కోరగా రెండు రాష్ట్రాలకు మొండిచెయ్యి చూపిన కేంద్ర ప్రభుత్వం.. గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు బల్క్‌డ్రగ్ పార్కులను కేటాయిస్తున్నట్టు ప్రకటించడంతో సర్వత్రా చర్చకు దారితీసింది. అయితే ఎట్టకేలకు తెలంగాణకు బల్క్ డ్రగ్స్ పార్కు మంజూరు చేసినట్లు కేంద్ర వైద్య శాఖ మంత్రి మన్సుక్ మాండవియా వెల్లడించడంతో ఎంపీ నామ నాగేశ్వరరావు ఆనందం వ్యక్తం చేశారు.
Mega Star Chiranjeevi : రచ్చలేపుతున్న ‘వాల్తేరు వీరయ్య’ న్యూ పోస్టర్
