మహారాష్ట్రలో ఘోర విషాదం చోటుచేసుకుంది. కుమార్తె తొలి బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో తల్లిదండ్రులు, బంధువులు, శ్రేయోభిలాషులంతా సంతోషంలో మునిగి తేలుతున్నారు. ఇంతలోనే ఊహించని విపత్తు మృత్యువు రూపంలో ముంచుకొచ్చింది. పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటుండగా ఒక్కసారిగా భవనం కూలిపోయింది. దీంతో బర్త్‌డే చిన్నారి, తల్లి సహా 15 మంది చనిపోయారు. తండ్రి ఆచూకీ ఇప్పటి వరకు లభించలేదు. ఈ విషాద ఘటనతో బంధువులంతా కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఇది కూడా చదవండి: US: ట్రంప్‌ను చంపేయండి.. విద్యార్థులపై కాల్పులు జరిపిన నిందితుడి తుపాకీపై రాతలు
ఓంకార్ జోయల్, ఆరోహి జోయల్ భార్యాభర్తలు. వీరికి ఏడాది కుమార్తె ఉత్కర్ష జోయల్ ఉంది. ఆగస్టగు 27న (బుధవారం) ఉత్కర్ష జోయల్‌ది తొలి పుట్టినరోజు. దీంతో బంధువులను, స్నేహితులను, శ్రేయోభిలాషులందరినీ పిలుచుకుని గ్రాండ్‌గా ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంటిని బెలూన్లు, లైట్లతో అలకరించారు. కుటుంబ సభ్యులు కేక్ కట్ చేసి ఫొటోలు దిగుతూ సంబరాలు చేసుకుంటున్నారు. అప్పటికే రాత్రి 11:30 గంటలు దాటింది. ఇంతలోనే ఒక్కసారిగా నాలుగు అంతస్తుల భవనం కూలిపోయింది. ఈ ఘటనలో మొత్తం 15 మంది ప్రాణాలు కోల్పోయారు. చిన్నారి ఉత్కర్ష జోయల్, ఆరోహి జోయల్ (24) కూడా మృతిచెందారు. భర్త ఓంకార్ జోయల్ ఆచూకీ మాత్రం లభించలేదు. రెస్క్యూ సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని శిథిలాలను తొలగిస్తున్నారు. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలోని విరార్‌లో బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. అయితే బర్త్‌డే సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నెటిజన్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Rajasthan: రాజస్థాన్‌లో అరుదైన సంఘటన.. 55 ఏళ్ల వయసులో 17వ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ
అయితే ఈ భవనం 13 ఏళ్ల క్రితం నిర్మించినట్లుగా తెలుస్తోంది. అక్రమంగా నాలుగు అంతస్తుల భవనం నిర్మించినట్లుగా అధికారులు గుర్తించారు. ఈ భవనంలో ప్రస్తుతం 50 ఫ్లాట్లు ఉన్నాయి. ప్రస్తుతం సంఘటనాస్థలిలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. 30 గంటలుగా సహాయ చర్యలు జరుగుతున్నాయి. అయితే గత కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు కారణంగా పునాదులు దెబ్బతినే అవకాశం ఉండొచ్చు.
