Site icon NTV Telugu

Amit Shah: ఉపాధి అవకాశాల్లో కొత్త శకం ప్రారంభం.. బడ్జెట్‌పై అమిత్ షా..

Amit Shah

Amit Shah

Amit Shah: ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రశంసలు కురిపించారు. ఉపాధి అవకాశాలలో కొత్త శకాని నాంది పలకడం ద్వారా భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు 2024-25 బడ్జెట్ సహకరిస్తుందని ఆయన అన్నారు. దేశ ఉద్దేశ్యం, ఆశలను ఈ బడ్జెట్ ప్రతిబింబిస్తుందని చెప్పారు. ‘‘ భారత యువత, మహిళలు, రైతుల శక్తిని సద్వినియోగం చేస్తూ, ఉపాధి అవకాశాలు కొత్త శకానికి నాంది పలికి, అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారేందుకు ఈ బడ్జెట్ ఇంధనంగా పనిచేస్తుంది’’అని ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

Read Also: Rahul Gandhi: ఇది “కుర్చీని కాపాడుకునే”, “కాపీ పేస్ట్” బడ్జెట్..

ప్రజల అనుకూల, అభివృద్ధి అనుకూల దార్మనిక బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కి అమిత్ షా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉంటే ప్రధాని నరేంద్రమోడీ బడ్జెట్‌ గురించి మాట్లాడుతూ.. ఇది దేశంలోని అన్ని వర్గాలదని అన్నారు. భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారేందుకు ఈ బడ్జెట్ ఉపయోగపడుతుందని చెప్పారు. మహిళలు, మధ్యతరగతి వర్గాలకు ఈ బడ్జెట్ పెద్దపీట వేసిందని చెప్పారు.

Exit mobile version