Site icon NTV Telugu

Nirmala Sitharaman: నిర్మలా సీతారామన్ బడ్జెట్ రికార్డులు.. ఆమె చదువు, నేపథ్యం ఇదే..

Nirmala Sitharaman

Nirmala Sitharaman

Nirmala Sitharaman: కేంద్ర బడ్జెట్‌లో ఏం ఉంటుందని దేశ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈరోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్ 2026ను ప్రవేశపెట్టబోతున్నారు. వరసగా 9వ సారి కేంద్ర బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ ఘటన సాధించిన తొలి ఆర్థిక మంత్రిగా ఆమె నిలిచారు. అంతకుముందు ఈ రికార్డ్ మొరార్జీ దేశాయ్(వరసగా 6 బడ్జెట్లు ప్రవేశపెట్టారు) పేరిటి ఉండేది.

ఇదే కాకుండా అత్యధిక సమయం బడ్జెట్ ప్రసంగం చేసి ఆర్థిక మంత్రిగా కూడా నిర్మలా సీతారామన్ పేరిటి రికార్డ్ ఉంది. 2020-21లో నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం 2 గంటల 42 నిమిషాలు (162 నిమిషాలు) ఉంది. ఈ ప్రసంగం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.40 గంటల వరకు సాగింది. ఎల్ఐసీ ఐపీఓ, ఆదాయపు పన్ను విధానం ప్రవేశపెట్టడం వంటి ముఖ్యమైన అంశాలు ఈ ప్రసంగంలో ఉన్నాయి. అయితే, ఆమె సుదీర్ఘ ప్రసంగంతో కాస్త అనారోగ్యానికి గురైన తర్వాత, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆమె చివరి రెండు పేరాలను చదివారు. సీతారామన్ 2020 బడ్జెట్ ప్రసంగం 2 గంటల 17 నిమిషాల పాటు సాగింది. ఇది రెండో అత్యంత సుదీర్ఘ బడ్జెట్. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్. ఇవే కాకుండా అత్యంత సంక్షిప్త బడ్జెట్ ప్రసంగం రికార్డు కూడా నిర్మలమ్మ పేరిటే ఉంది. ఫిబ్రవరి 2024లో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ప్రసంగం కేవలం 56 నిమిషాల పాటు సాగింది.

నిర్మలా సీతారామన్ చదువు, నేపథ్యం ఇదే:

నిర్మలా సీతారామన్ ఆగస్టు 18, 1959న తమిళనాడులోని మధురైలో కె సీతారామన్, కె సావిత్రి దంపతులకు జన్మించారు. ఆమె తన పాఠశాల విద్యను, ఆర్థిక శాస్త్రంలో డిగ్రీని తిరుచిరాపల్లి లోని సీతాలక్ష్మీ రామస్వామి కాలేజీలో పూర్తి చేశారు. న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. జెఎన్‌యులోని స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్‌లోని అంతర్జాతీయ వాణిజ్య విభాగంలో ఆర్థికశాస్త్రంలో ఎంఫిల్ చేశారు.

లండన్ వెళ్లిన ఆమె, అగ్రికల్చర్ ఇంజనీర్స్ అసోసియేషన్‌లో ఒక ఆర్థికవేత్తకు సహాయకురాలిగా, ఆ తర్వాత ప్రైస్‌వాటర్‌హౌస్‌లో పనిచేశారు. లండన్‌లో, ఆమె కొంతకాలం పాటు బీబీసీ వరల్డ్ సర్వీస్‌లో కూడా పనిచేశారు. భారత్ తిరిగి వచ్చి, హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ పబ్లిక్ పాలసీ స్టడీస్‌కు డిప్యూటీ డైరెక్టర్‌గా చేశారు. 1997లో, ఆమె హైదరాబాద్‌లో పిల్లల విద్య, అనుభవపూర్వక అభ్యాసంపై దృష్టి సారించే ‘ప్రణవ’ అనే పాఠశాలను స్థాపించారు.

Exit mobile version