Site icon NTV Telugu

Tamil Nadu: తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య

Dkeke

Dkeke

తమిళనాడు బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్‌ హత్యకు గురయ్యారు. శుక్రవారం పెరంబూర్‌లోని ఆయన నివాసానికి సమీపంలో ఆరుగురు గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా నరికి చంపారు. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నేరస్థుల్ని పట్టుకోవడానికి పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఇక హత్య విషయం తెలిసిన తర్వాత అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆర్మ్‌స్ట్రాంగ్ మృతదేహాన్ని చెన్నైలోని రాజీవ్ గాంధీ జనరల్ ఆసుపత్రికి తరలించారు.

 

 

Exit mobile version