NTV Telugu Site icon

Mayawati: రిజర్వేషన్లను రద్దు చేసేందుకు బీజేపీ-కాంగ్రెస్ కుట్ర చేస్తున్నాయి..

Mayawathi

Mayawathi

Mayawati: ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా రిజర్వేషన్ బచావో సమితి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా భారత్ బంద్ కొనసాగుతుంది. దీనికి బీఎస్పీతో పాటు పలు రాజకీయ పార్టీలు మద్దతు పలుకుతున్నాయి. ఇప్పుడు ఈ విషయంపై మాయావతి భారత్ బంద్ గురించి మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ వంటి పార్టీలు రిజర్వేషన్లను రద్దు చేసేందుకు ఈ వర్గీకరణను తీసుకొచ్చారని పేర్కొనింది. అందులో భాగంగానే ఈ రెండు పార్టీలు కుమ్మక్కై ఎస్సీ, ఎస్టీ వర్గీకరణలో క్రీమీలేయర్‌ విధానం అమలు చేయడం ద్వారా తీవ్రంగా నష్టపోతామని మాయావతి చెప్పుకొచ్చింది.

Read Also: Andhra Pradesh: చావు కూడా ఆ దాంపత్యాన్ని విడదీయలేదు.. భర్త మరణంతో కుప్పకూలి భార్య మృతి

రాజ్యాంగ సవరణ ద్వారా రిజర్వేషన్లలో మార్పులను రద్దు చేయాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల కు చెందిన ప్రజలు ‘భారత్ బంద్’లో భాగంగా ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకి మెమోరాండం సమర్పిస్తున్నారు.. ఎలాంటి హింసాకాండకు తావులేకుండా క్రమశిక్షణతో, శాంతియుతంగా ఈ బంద్ నిర్వహించారని ఆమె చెప్పుకొచ్చింది. ఎస్సీ-ఎస్టీలతో పాటు ఓబీసీ వర్గాలకు కూడా రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్ హక్కు వచ్చింది.. ఈ వర్గాలకు నిజమైన దూత బాబా సాహెబ్ డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ కృషి ఫలితమే.. దీని అవసరం, సున్నితత్వాన్ని బీజేపీ, కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీలు తిరస్కరించాయని మాయావతి గుర్తు చేశారు.