బీఎస్ఎఫ్కు అధికారాల పెంపుపై వివాదం.. పంజాబ్ అభ్యంతరం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సరిహద్దు భద్రతాదళం అధికారాలను పెంచుతూ కేంద్రహోంశాఖ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. బంగ్లాదేశ్, పాకిస్థాన్ తో అంతర్జాతీయ సరిహద్దుల నుంచి మూడు రాష్ట్రాల్లో 50 కిలోమీటర్లు లోపలి వరకు తనిఖీలు, అరెస్టులు, నిర్బంధం చేసే అధికారాలను బీఎస్ఎఫ్కు ఇస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ సరిహద్దుల నుంచి 15 కిలోమీటర్ల వరకు మాత్రమే బీఎస్ఎఫ్కు తనిఖీలు, అరెస్టులు చేసే అధికారముంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం సమాఖ్య స్పూర్తికి విరుద్ధం అంటూ పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ ఛన్ని అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రాల స్వయం ప్రతిపత్తికి విఘాతం కలిగించే విధంగా కేంద్రం తీసుకున్న ఏకపక్ష నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇది దేశ సమాఖ్య పై ప్రత్యక్ష దాడి అని అభివర్ణించారు. తక్షణమే ఈ అసంబద్దమైన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని అమిత్‌షాను కోరారు పంజాబ్ సీఎం చన్నీ.
దేశ భద్రత కే ఈనిర్ణయం అంటూ కేంద్ర హోమ్ శాఖ సమర్థించుకుంటోంది. దేశ భద్రత రిత్యా బీఎస్ఎఫ్ అధికార పరిధిని పెంచాల్సి వచ్చిందని హోమ్ మంత్రిత్వ శాఖ చెబుతోంది. ఇటీవల డ్రోన్ల ద్వారా భారత భూభాగంలో ఆయుధాలను జారవేసిన సంఘటనలను కారణంగా చూపిస్తోంది. మొత్తం 10 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో జాతీయ భద్రత కు విఘాతం కలిగించే అక్రమ, చట్టవిరుధ్ద కార్యకలాపాలను నిరోధించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతోంది హోంశాఖ. 1968 సరిహద్దు భద్రతా చట్టం లోని సెక్షన్ 139 కింద బీఎస్ఎఫ్ ఆపరేషన్స్ కు సంబంధించి ఆయా పరిస్థితులను బట్టి, ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకునే అధికారాలు కేంద్రానికి ఉన్నాయి. సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్, బెంగాల్, అస్సాం లలో బీఎస్ఎఫ్ అధికారులు తనిఖీలు చేసి, ఎవరినైనా నిర్బంధం లోకి తీసుకోవచ్చు. ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, మిజోరం, త్రిపుర, మణిపూర్ ల తో పాటు, జమ్మూ కాశ్మీర్, లడక్ లో కూడా బీఎస్ఎఫ్ తనిఖీలు, అరెస్టులు చేయవచ్చు. ఈ షెడ్యూల్ లో మార్పులు చేస్తూ కేంద్ర హోమ్ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, సరిహద్దు రాష్ట్రాల్లో బీఎస్ఎఫ్ అధికారులు పాస్ పోర్ట్ చట్టం, కస్టమ్స్ చట్టం, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్ స్టాన్సెస్ చట్టం-1985, కింద తనిఖీలు, అరెస్టులు చేసే అధికారాలు సంక్రమించాయి. కేంద్రం తాజా నిర్ణయంతో ఏదైనా కేసులో కచ్చిత సమాచారముంటే, సత్వరమే బీఎస్ఎఫ్ చర్యలు తీసుకునే అవకాశముంటుందంటున్నారు బీఎస్ఎఫ్ అధికారులు.
Also Read
- Vivek Agarwal's Family: విధి ఆడిన వింత నాటకం.. తండ్రి కోసం వచ్చి ఢిల్లీ హోటల్ అగ్నిప్రమాదంలో ఆరుగురు మృతి!
- TMC Rebellion: నాడు ఠాక్రే, నేడు మమత.. దేశ రాజకీయాల్లో రెండు ముక్కలుగా చీలిపోయిన అతిపెద్ద పార్టీలు ఇవే..
- MP: ‘సారీ అమ్మా, నాన్న.. మళ్లీ పరీక్ష రాసే ధైర్యం లేదు’.. కన్నీరు పెట్టిస్తున్న నీట్ విద్యార్థిని సూసైడ్ నోట్
- Aadhaar Mobile Number Update: ఆధార్‌లో మొబైల్ నంబర్ మార్పు.. ఎన్ని సార్లు అప్డేట్ చేసుకోవచ్చు? పూర్తి వివరాలు ఇవే
తాజావార్తలు
-
Jos Buttler: నెహ్రా నిర్ణయంతో షాకైన జోస్ బట్లర్.. గుజరాత్ ఫైనల్ ఓటమి వెనుక అసలు కథ ఇదే!
-
Vivek Agarwal’s Family: విధి ఆడిన వింత నాటకం.. తండ్రి కోసం వచ్చి ఢిల్లీ హోటల్ అగ్నిప్రమాదంలో ఆరుగురు మృతి!
-
Ramchander Rao: కాక్రోచ్ పార్టీ వెనుక ఉన్నది వాళ్లే.. బీజేపీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు..
-
Lagaan Re Release Date : 25 ఏళ్ల తర్వాత థియేటర్లలోకి ఆమిర్ ఖాన్ ‘లగాన్’… మచ్చటగా మూడు రోజులు మాత్రమే.!
-
Sophie Ecclestone Fielding: గల్లీ క్రికెట్లో కూడా ఇలా ఆడరమ్మ.. ఇంగ్లండ్ స్టార్ సోఫీ ఎక్లెస్టోన్‌ను ఆడేసుకుంటున్న నెటిజెన్స్!
ట్రెండింగ్
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!