NTV Telugu Site icon

BS Yediyurappa Retirement: రాజకీయాలకు గుడ్‌బై.. ఇక నా వళ్లకాదు అంటున్న సీనియర్‌ పొలిటీషియన్‌

Bs Yediyurappa

Bs Yediyurappa

ఓ సీనియర్‌ పొలిటీషనర్‌ రాజకీయాలకు రిటైర్మెంట్‌ ప్రకటించే సూచనలు చేశారు.. కర్ణాటక రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్‌ నేత యడియూరప్ప ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు సంకేతాలు ఇచ్చారు.. ఇప్పటి వరకు తాను ప్రాతినథ్యం వహిస్తూ వచ్చిన శికరైపుర అసెంబ్లీ స్థానాన్ని ఖాళీ చేస్తున్నాను.. ఇకపై తన కుమారుడు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీవై విజయేంద్ర అక్కడి నుంచి బరిలోకి దిగుతారని.. రానున్న 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానం నుంచి విజయేంద్ర పోటీ చేస్తారని తెలిపారు. నాలుగుసార్లు కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేసిన బీఎస్ యడియూరప్ప తన రెండవ కుమారుడైన విజయేంద్ర కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.. ప్రత్యక్ష రాజకీయాల నుంచి రిటైర్మెంట్‌ను సూచిస్తూ, యడ్యూరప్ప తన కుమారుడికి ప్రజల మద్దతును కోరాడు మరియు తాను మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు.. కాగా, యడ్యూరప్ప 1983 నుంచి ఎనిమిది సార్లు ఈ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు..

మీరు నన్ను ఆదరించిన విధంగానే విజయేంద్రను కూడా ఆదరించాలని కోరుతున్నాను.. లక్ష ఓట్లకు పైగా మెజార్జీ సాధించేలా చూడాలని నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు యడియూరప్ప.. ఇక, తాను వారానికోసారి నియోజకవర్గంలో పర్యటిస్తానని, నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రత్యర్థి కాంగ్రెస్‌పై విరుచుకుపడిన ఆయన, పార్టీలో ఇద్దరు వ్యక్తులు ముఖ్యమంత్రి పదవి కోసం పోరాడుతున్నారని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ అఖండ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.. 79 ఏళ్ల యడియూరప్ప.. లింగాయత్ నేతగా ఎదిగారు.. 2014లో షిమోగా నుండి లోక్‌సభ ఎంపీగా కూడా గెలిచారు. ఆయన కుమారుడు బీవై రాఘవేంద్ర 2014లో షికారిపుర నుంచి అసెంబ్లీ ఉపఎన్నికల్లో బీజేపీ టిక్కెట్‌పై విజయం సాధించారు.. ఇక, యడియూరప్పపై అనేక అవినీతి ఆరోపణలు కూడా వచ్చాయి.. కొన్ని వివాదాలు కూడా వెంటాడాయి.. కర్ణాటకలో బీజేపీ తిరిగి అధికారంలోకి రావడం వెనుక ఆయన కృషి ఎంతో ఉందని చెప్పుకోవాలి.