ఉద్యోగులకు యడియూరప్ప తీపి కబురు.. చివరి కానుక..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి ఇప్పటికే రాజీనామా చేశారు బీఎస్ యడియూరప్ప… రేపేమాపో కొత్త సీఎంను ఎన్నుకునేందుకు బీజేపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది.. మరోవైపు.. యడియూరప్ప రాజీనామా చేసిన సమయంలో.. కొత్త సీఎంను ఎన్నుకునేంత వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా వ్యవహరించాల్సిందిగా గవర్నర్ కోరారు… ఇక, చివరినిమిషంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు చెప్పారు యడియూరప్ప.. ఉద్యోగుల డీఏను 10.25 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.. దీంతో ఉద్యోగుల మూలవేతనంలో డీఏ 21.50 శాతానికి పెరిగింది.. ప్రస్తుతం కర్నాటకలో ప్రభుత్వ ఉద్యోగుల డీఏ వారి మూలవేతనంలో 11.25 శాతంగా ఉంది.. ఇప్పుడు ఏకంగా 21.50కు చేరింది.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 6 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు, 4.5 లక్షల మంది పెన్షనర్లతో పాటు వివిధ పీఎస్‌యూలు, కార్పొరేషన్లలో పనిచేసే దాదాపు మూడు లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. కాగా, ఇవాళ రాత్రి 7 గంటలకు బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది.. ఈ సమావేశంలో ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరించనుంది అధిష్టానం.. ఇప్పటికే పరిశీలకులుగా కేంద్రమంత్రులు ధర్మేంధ్ర ప్రధాన్, జి. కిషన్‌రెడ్డిని నియమించిన సంగతి తెలిసిందే.
Also Read
తాజావార్తలు
-
GST Collection June 2026: జూన్‌లో జీఎస్టీ వసూళ్ల జోరు.. రూ.1.95 లక్షల కోట్లకు చేరిన ఆదాయం
-
Nara Lokesh: ఇప్పుడు ‘మావిగన్’.. రేపు బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాద్ కలిపి ‘బెన్‌తాహై’ అంటారేమో..!
-
Donald Trump: డియర్ ట్రంప్.. నీకంత సీన్ లేదంటగా..! ప్యూ రీసెర్చ్ సెంటర్ నివేదికలో బయటపడ్డ ప్రెసిడెంట్ గారి బండారం
-
Malayalam movie updates: మోహన్‌లాల్‌తో ప్రియదర్శన్ 100వ సినిమా వాయిదా.. కారణం ఇదేనా?
-
Syria New Parliament: సిరియాలో ‘కొత్త శకం’.. అసద్ పతనం తర్వాత తొలి పార్లమెంట్ ఇదే!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!