BS Yediyurappa: కర్ణాటక మాజీ సీఎంపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. మాజీ సీఎం యడియూరప్ప ఒక మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అభియోగాలు నమోదయ్యాయి. 17 ఏళ్ల బాలిక తల్లి ఫిర్యాదుతో బెంగళూర్‌లోని సదాశివనగర్ పోలీసులు పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. పోలీసుల ప్రకారం.. చీటింగ్ కేసులో సహాయం కోరేందుకు తల్లి, ఆమె కుమార్తె యడియూరప్ప దగ్గరకు వెళ్లిన సమయంలో లైంగిక వేధింపులు జరిగనట్లు బాలిక తల్లి ఆరోపించారు.
Read Also: Israel- Hamas War: ఆహారం కోసం క్యూలో నిలబడిన పాలస్తీనియన్లపై విధ్వంసం.. 20 మంది మృతి
బీజేపీ నేత యడియూరప్పపై లోక్‌సభ ఎన్నికల ముందు ఆరోపణలు రావడం చర్చనీయాంశం అయింది. 2008-2011 మధ్య కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2018లో కొద్ది రోజుల పాటు, ఆ తర్వాత జూలై 2019-2021 మధ్య మరోసారి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత బీజేపీ అధిష్టానం యడియూరప్పను తప్పించి జూలై 2021లో బస్వరాజ్ బొమ్మైని సీఎంగా చేసింది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించి, బీజేపీని ఓడించింది.
