NTV Telugu Site icon

Oxford University: కశ్మీర్‌పై ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో చర్చ.. మండిపడిన భారత విద్యార్థులు

Oxfaride

Oxfaride

Oxford University: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో ఓ చర్చా వేదిక తీవ్ర వివాదానికి దారి తీసింది. ఈరోజు (శుక్రవారం) ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీలో డిబేటింగ్ సొసైటీ నిర్వహించిన డిబేట్ లో జమ్మూ కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి గురించి కమిటీ సభ్యులు మాట్లాడటంతో ఇండియన్ స్టూడెంట్స్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. కశ్మీర్‌పై మాట్లాడిన ముజ్జామ్మిల్‌ ఆయూబ్‌ ఠాకూర్‌, జఫార్‌ ఖాన్‌లకు ఉగ్రవాద గ్రూపులతో సంబంధాలున్నాయని భారతీయ విద్యార్థులు ఆరోపించారు.

Read Also: Kishan Reddy: బుల్డోజర్ లతో ఎలా తొక్కిస్తారో చూస్తాం.. ఒక సీఎం ఇలానేనా మాట్లాడేది..

ఇక, ప్రజలను రెచ్చగొట్టడమే లక్ష్యంగా ఆయూబ్‌ ఠాకూర్‌ తరచూ విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారని భారతీయ విద్యార్థులు ఆరోపించారు. వారికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. ఆక్స్‌ఫర్డ్ యూనియన్‌ ఎల్లప్పుడూ ఉగ్రవాదుల వైపే ఉంటుందని వారు ఆరోపణలు గుప్పించారు. జమ్మూకశ్మీర్‌ అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ భారత్‌లోని అంతర్ భాగంగా ఉంటుందని పేర్కొన్నారు. 1984లో లండన్‌లో భారత దౌత్యవేత్త రవీంద్ర మాత్రే కిడ్నాప్‌, హత్య వెనక జమ్మూకశ్మీర్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ పాత్ర ఉందని ఆరోపించారు.

Read Also: Liquor Shops Closed: మద్యం ప్రియులకు షాక్.. ఈ నెల 20న వైన్ షాప్స్ బంద్

అలాగే, ముజ్జామ్మిల్‌ ఆయూబ్‌ ఠాకూర్‌ వరల్డ్ కాశ్మీర్ ఫ్రీడమ్ మూవ్‌మెంట్‌ అనే సంస్థను ఏర్పాటు చేశారు. ఆయన తండ్రితో కలిసి సంయుక్తంగా మెర్సీ యూనివర్సల్ అనే మరో సంస్థను కూడా నిర్వహిస్తున్నాడు. కాగా, ఈ రెండింటికి ఉగ్రవాద సంస్థలతో అనేక సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై అమెరికాకు చెందిన ఎఫ్‌బీఐతో పాటు యూకేకు చెందిన నిఘా సంస్థలు దర్యాప్తు చేసినట్లు పలు అంతర్జాతీయ మీడియాలో అనేక కథనాలు వెల్లడించాయి.