BRICS: భారత్కు దౌత్య విజయం.. ‘‘పహల్గామ్ ఉగ్రదాడి’’పై బ్రిక్స్ ఖండన..
- పహల్గామ్ ఉగ్రవాద దాడిపై బ్రిక్స్ కీలక ప్రకటన..
- ఉగ్రవాదాన్ని ఖండించిన బ్రిక్స్ దేశాల నేతలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BRICS: న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో సభ్యదేశాలు ‘‘పహల్గామ్ ఉగ్రవాద దాడి’’ని తీవ్రంగా ఖండించాయి. బ్రిక్స్ దేశాల సంయుక్త ప్రకటనలో 2025 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. “2025 ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిని అత్యంత తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దాడిలో 26 మంది మరణించగా, మరెందరో గాయపడ్డారు” అని బ్రిక్స్ సంయుక్త ప్రకటనలో నేతలు పేర్కొన్నారు.
పహల్గామ్ ఉగ్రవాద దాడిని బ్రిక్స్ సభ్యదేశాల సంయుక్త ప్రకటనలో ప్రస్తావించడాన్ని భారత దౌత్య విజయంగా విశ్లేషకులు చెబుతున్నారు. ఉగ్రవాదాన్ని అన్ని రూపాల్లో ఎదుర్కొనేందుకు తమ నిబద్ధతను బ్రిక్స్ నేతలు మరోసారి స్పష్టం చేశారు. సీమాంతర ఉగ్రవాదం ఉగ్రవాదానికి నిధులు, ఉగ్రవాదులకు సురక్షిత స్థావరాలను కల్పించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఉగ్రవాదంపై ‘‘జీరో టాలరెన్స్’’ విధానంపై నేతలంతా ఒక్కతాటిపై ఉన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో ద్వంద్వ ప్రమాణాలను తిరస్కరించాలని స్పష్టం చేశారు. ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్న వారిని బాధ్యులుగా గుర్తించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. పహల్గామ్ ఉగ్రవాద దాడిని వరసగా రెండు బ్రిక్స్ సమావేశాల్లో ప్రస్తావించారు. గతేడాది సెప్టెంబర్లో బ్రిక్స్ మంత్రుల సంయుక్త ప్రకటనలో కూడా దీనిని ఖండించారు.
Also Read
- Ketan Agarwal Case: కేతన్ హత్య 5 వేల పేజీల ఛార్జిషీట్.. పిచ్చిగా ప్రేమించిన కేతన్, హత్య చేసిన సియా..
- Student Protests: రేప్ నుంచి దెయ్యం వరకు.. పుకార్లతో రగిలిపోతున్న యూనివర్సిటీలు.!
- Kaveri Engine: రష్యాలో ‘‘కావేరి ఇంజన్’’ సత్తా.. భారత స్వేదేశీ ఇంజన్ సిద్ధం.!
- Congress: ప్రధాని మోదీ, జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి.. సీడబ్ల్యూసీలో కాంగ్రెస్ 5 డిమాండ్లు..
తాజావార్తలు
-
Ketan Agarwal Case: కేతన్ హత్య 5 వేల పేజీల ఛార్జిషీట్.. పిచ్చిగా ప్రేమించిన కేతన్, హత్య చేసిన సియా..
-
Explainer: మరిన్ని విపత్తులు తప్పవా?
-
Lava Smart Phone: 6000mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. లావా నుంచి బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
JNTU Sultanpur : జేఎన్టీయూ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. ఇద్దరు సీనియర్లు సస్పెండ్
-
Student Protests: రేప్ నుంచి దెయ్యం వరకు.. పుకార్లతో రగిలిపోతున్న యూనివర్సిటీలు.!
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!