Site icon NTV Telugu

Mamata Banerjee: ‘‘మమతా బెనర్జీని నిందించే వారి వేళ్లు విరగ్గొట్టండి’’..

Mamata Banerjee

Mamata Banerjee

Mamata Banerjee: కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో 31 ఏళ్ల పీజీ ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం, హత్య జరిగింది. ఈ దారుణ ఘటనపై యావత్ దేశం అట్టుడుకుతోంది. ముఖ్యంగా వైద్యులు బాధితురాలికి న్యాయం జరిగాలని ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ కేసులో ప్రభుత్వ నిర్లక్ష్యం, పోలీసుల వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ కలకత్తా హైకోర్టు ఈ కేసుని సీబీఐకి బదిలీ చేసింది. ఈ రోజు సుప్రీంకోర్టు కూడా ఈ కేసులో బెంగాల్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

Read Also: Wife Caught Her Husband Red-Handed: మహిళా కానిస్టేబుల్‌ ఇంట్లో భర్త.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య..

మమతా బెనర్జీపై, ఆమె ప్రభుత్వంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష బీజేపీ ఆమె రాజీనామాను డిమాండ్ చేస్తోంది. ఇదిలా ఉంటే, ఈ ఘటన మధ్య ఆ రాష్ట్ర మంత్రి ఉదయన్ గుహ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మమతా బెనర్జీని నిందిస్తూ, ఆమెను రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న వారి వేళ్లు విరిగిపోతాయని వార్నింగ్ ఇవ్వడం వివాదంగా మారింది. ఓ వీడియో క్లిప్‌లో బెంగాలీలో మాట్లాడుతున్న ఆయన “మమతా బెనర్జీపై దాడి చేసేవారు, ఆమెపై వేళ్లు చూపేవారు, ఆమె రాజీనామా చేయాలని డిమాండ్ చేసే వ్యక్తులు ఎప్పటికీ విజయం సాధించలేరు. సీఎం వైపు వేళ్లు చూపితే వారి వేళ్లు విరిగిపోతాయి, వారు నలిగిపోతారు” అని అన్నారు.

ఇదిలా ఉంటే ఈ కేసులో తృణమూల్ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. అంతకుముందు డాక్టర్ల సమ్మెని విమర్శిస్తూ టీఎంసీ ఎంపీ అరూప్ చక్రవర్తి.. ఆందోళనల కారణంగా ప్రజలు ఆగ్రహం వైద్యులకు వ్యతిరేకంగా మారితే వారిని రక్షించబోమని హెచ్చరించారు. మంత్రి ఉదయన్ గుహా మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్‌ని బంగ్లాదేశ్‌గా మార్చడానికి మేము అనుమతించమని చెప్పారు.

Exit mobile version