NTV Telugu Site icon

Agniveers: బ్రహ్మోస్ ఏరోస్పేస్ విభాగాలలో అగ్నివీరులకు 15 శాతం రిజర్వేషన్లు..

Agniveers

Agniveers

భారతదేశం-రష్యాల జాయింట్ వెంచర్ అయిన బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్.. తమ కంపెనీలో కనీసం 15 శాతం టెక్నికల్ పోస్టులను అగ్నివీరుల కోసం రిజర్వ్ చేయాలని నిర్ణయించింది. అంతేకాకుండా.. అనేక సంస్థల్లో అగ్నివీరులకి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపింది. అయితే ఒక ప్రైవేట్ సంస్థ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదే మొదటిసారి. టెక్నికల్ పోస్టులే కాకుండా అడ్మినిస్ట్రేటివ్, సెక్యూరిటీ అవసరాలకు అనుగుణంగా అగ్నివీరులకు ప్రాధాన్యత ఇస్తామని బ్రహ్మోస్ తెలిపింది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్‌సోనిక్ క్షిపణిని తయారు చేసే ఈ కంపెనీ.. అగ్నివీరులతో కలిసి పని చేయనుంది. అందుకోసం వారిని అవుట్‌సోర్సింగ్ కాంట్రాక్ట్ కింద చేర్చుకోనుంది. అలాగే.. కంపెనీ తన వ్యాపారానికి సంబంధించిన ఇతర అనుబంధ సంస్థలు కూడా అగ్నివీర్‌లను నియమించుకోవడానికి ప్రోత్సహిస్తోంది.

బ్రహ్మోస్‌కి అగ్నివీరులు ఎందుకు కావాలి..?
ఆర్మీలో రిక్రూట్‌మెంట్ కోసం సాధారణ ప్రక్రియను తొలగించడం ద్వారా భారత ప్రభుత్వం 2022 నుండి అగ్నివీర్ యోజనను ప్రారంభించింది. ఇందులో రిక్రూట్ చేయబడిన యువకులు నాలుగు సంవత్సరాల పాటు సైన్యంలో సేవలందిస్తారు. ఈ సమయంలో సైనిక వ్యూహాలతో పాటు.. సాంకేతికత, నైపుణ్యాలను కూడా పొందుతారు. అగ్నివీరులు సైన్యంలో మెరుగైన శిక్షణ పొందుతారు. అలాంటప్పుడు వారిని నియమించుకున్నప్పుడు.. శిక్షణ కోసం విడిగా ఖర్చు చేయవలసిన అవసరం ఉండదని బ్రహ్మోస్ తెలిపింది. అలాగే తమ కంపెనీలో అధిక శిక్షణ పొందిన వర్క్ ఫోర్స్‌ను సృష్టిస్తుందని.. ఇది కంపెనీకి మాత్రమే ప్రయోజనం చేకూరుస్తుందని బ్రహ్మోస్ పేర్కొంది.

Ashwini Vaishnaw: ఇండియన్ రైల్వేస్ గుడ్ న్యూస్.. పండుగల సందర్భంగా 6,000 ప్రత్యేక రైళ్లు

భాగస్వామ్య కంపెనీల్లో కూడా అగ్నివీర్‌ను కొనసాగించడంపై చర్చ కొనసాగుతోంది. కంపెనీ డిప్యూటీ CEO ప్రకారం.. ‘భారత రక్షణ పరిశ్రమలో పనిచేస్తున్న 250 కంటే ఎక్కువ బృందాలు బ్రహ్మోస్‌లో భాగంగా ఉన్నాయి. అందరితో మాట్లాడాం. మా బృందంలో మాతో చేరడానికి మొదటి బ్యాచ్ అగ్నివీర్స్ కోసం భారత రక్షణ పరిశ్రమ ఎదురుచూస్తోంది. దీన్ని మరింత విస్తరించాలనుకుంటున్నాం.’ అని తెలిపారు. తాము తమ విక్రేతలందరినీ కూడా అభ్యర్థిస్తున్నాము.. తాము తమ భాగస్వామి సంస్థలతో కూడా మాట్లాడుతున్నాము.. ప్రతి ఒక్కరూ తమ సంస్థల్లో కనీసం 15 శాతం ఉద్యోగాలను అగ్నివీరులకి కేటాయించాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం అగ్నివీర్‌ పథకాన్ని ప్రారంభించినప్పుడు ప్రతిపక్షాలు, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తూ యువత భవిష్యత్తుతో ఆడుకుంటోందని విపక్షాల నుంచి విమర్శలు వచ్చాయి. నిరంతర నిరసనల తరువాత.. ప్రభుత్వం కొన్ని సైనిక సంస్థలలో అగ్నివీరులకి రిజర్వేషన్‌ను కల్పించింది. అందులో హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని CAPFలలో 10 శాతం, హర్యానా ప్రభుత్వం కొన్ని ప్రభుత్వ ఉద్యోగాలలో 10 శాతం రిజర్వేషన్‌ను అందించాయి. దీంతో పాటు ఉత్తరప్రదేశ్‌లోని యోగి ప్రభుత్వం కూడా అగ్నివీర్‌కు రాష్ట్ర పోలీసు, పిఎసిలో ప్రాముఖ్యత ఇవ్వనున్నట్లు ప్రకటించింది.