Site icon NTV Telugu

Brahma Kumaris Chief: బ్రహ్మకుమారిస్ చీఫ్ దాది రతన్ మోహని కన్నుమూత..

Brahma Kumaris

Brahma Kumaris

Brahma Kumaris Chief: బ్రహ్మకుమారిస్ చీఫ్ దాది ర‌త‌న్‌ మోహిని ఈ రోజు (ఏప్రిల్ 8న) ఉదయం కన్నుమూశారు. మార్చి 25 వ తేదీన ఆమె 100 పుట్టిన రోజును జరుపుకున్నారు. వందేళ్ల మైలురాయి దాటిన రెండో బ్రహ్మకుమారిస్ గా ర‌త‌న్ మోహిని రికార్డు సృష్టించారు. అయితే, గత కొన్ని రోజుల నుంచి దాది రతన్ మోహిన్ ఆరోగ్యం సరిగ్గా లేదు. ఇక, ఆదివారం నాడు సాయంత్రం ఆమె పరిస్థితి మ‌రింతగా క్షీణించడంతో.. రాజస్థాన్ లోని అబూ రోడ్డులో ఉన్న శాంతివనంలోని ట్రామా సెంటర్ కి డయాలసిస్ కోసం తరలించారు.

Read Also: Meghalaya: మేఘాలయ ప్రిన్సిపల్ సెక్రటరీ అనుమానాస్పద మృతి.. ఉజ్బెకిస్తాన్‌లో ఘటన

ఇక, సోమవారం నాడు దాది రతన్ మోహిన్ పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారిపోయింది. దీంతో క్రిటికల్ కండీషన్ లో ఉన్న ఆమెను అహ్మదాబాద్ లోని జైడన్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇవాళ తెల్లవారుజామున 1.20 నిమిషాలకు తుది శ్వాస విడిచినట్లు వెల్లడించారు. కాగా, అబూ రోడ్డులో ఉన్న బ్రహ్మకుమారిస్ ప్రధాన కార్యాల‌యంలోని శాంతివ‌నంకు ఆమె పార్థివదేహాన్ని తీసుకెళ్లారు.

Read Also: Balabhadrapuram Cancer Cases: ఎమ్మెల్యే నల్లమిల్లి అత్యుత్సాహమే బలభద్రపురానికి శాపం..! క్యాన్సర్‌పై తప్పుడు ప్రచారం..!

కాగా, సింధ్‌లోని హైద‌రాబాద్‌లో మార్చి 25వ తేదీ 1925న దాది ర‌త‌న్ మోహిని జ‌న్మించారు. ఆమె ఒరిజిన‌ల్ పేరు ల‌క్ష్మీ.. ఉన్నతమైన కుటుంబంలో జ‌న్మించారు. ఇక, హైద‌రాబాద్‌, క‌రాచీ నుంచి ఆమె అంత‌ర్జాతీయ స్థాయిలో బ్రహ్మకుమారిస్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. 1954లో జ‌పాన్‌లో జ‌రిగిన వ‌ర‌ల్డ్ పీస్ కాన్ఫరెన్స్‌లో బ్రహ్మకుమారీల తరపున పాల్గొన్నారు. అలాగే, హాంగ్‌కాంగ్‌, సింగ‌పూర్, మ‌లేషియాతో పాటు ఆసియా దేశాల్లోనూ దాది రతన్ మోహిన్ పర్యటించారు.

Exit mobile version