Heart Attack: ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది గుండె పోటుతో మరణిస్తున్నారు. చిన్న పిల్లలతో పాటు యుక్త వయసులో ఉన్న యువత కూడా గుండె పోటుకు గురవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఉత్తర్ ప్రదేశ్ లోని అలీగఢ్ జిల్లాలో 14 ఏళ్ల బాలుడు నడుస్తున్న సమయంలో గుండె పోటుతో మణించాడు. మోహిత్ చౌదరి అనే బాలుడు తన పాఠశాలలో క్రీడా పోటీల కోసం రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు సిరౌలి గ్రామంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది.
Read Also: Bangladesh: ‘‘భారతీయ హిందువు మా దేశం ఎందుకు వచ్చావురా..?’’ యువకుడికి బంగ్లాదేశ్‌లో దాడి..
బాలుడు మొదట్లో తన స్నేహితుడితో కలిసి రెండు రౌండ్లు పరిగెత్తాడు, ఆ తర్వాత కొద్దిసేపటికే కుప్పకూలాడు. పిల్లాడిని కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా, వారు సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లే సరికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. పాఠశాలలో డిసెంబర్ 07న జరగాల్సిన క్రీడా పోటీల కోసం బాలుడు సిద్ధమవుతున్న తరుణంలో ఈ విషాదం నెలకొంది. ఆగస్టు నెలలోనే బాలుడి తండ్రి రోడ్డు ప్రమాదంలో చనిపోగా, ఇప్పుడు బాలుడు మరణించడం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది.
సెప్టెంబర్ నెలలో ఇలాగే యూపీలోని లక్నోలోని ఓ పాఠశాలలో ఆడుకుంటూ 9 ఏళ్ల బాలిక గుండె పోటుతో మరణించింది. బాలిక ప్లే గ్రౌండ్‌లో ఆడుకుంటుండగా స్పృహతప్పి పడిపోయింది, ఆ తర్వాత ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆమె చనిపోయినట్లు ప్రకటించారు.