Site icon NTV Telugu

Bomb threats: ఆగని బాంబు బెదిరింపులు.. ఈ రోజు 6 ఇండిగో విమానాలకు బెదిరింపులు..

Bomb Threats

Bomb Threats

Bomb threats: వరసగా బాంబు నకిలీ బాంబు బెదిరింపులు భారత విమానయాన రంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ వారం ప్రారంభం నుంచి 70కి పైగా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. తాజాగా ఈ రోజు మరో 6 ఇండిగో విమానాలు కూడా ఇదే తరహా బెదిరింపుల్ని ఎదుర్కొన్నాయి. విమానయాన సంస్థ తన ప్రయాణికులు, సిబ్బంది భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు , సంబంధిత అధికారుల సహాకారంతో అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు చెప్పింది.

బాంబు బెదిరింపులు ఎదుర్కొన్న విమానాలు:

ఫ్లైట్ 6E 58, జెడ్డా – ముంబై
ఫ్లైట్ 6E 87, కోజికోడ్ – దమ్మామ్
ఫ్లైట్ 6E 11, ఢిల్లీ – ఇస్తాంబుల్
ఫ్లైట్ 6E 17, ముంబై – ఇస్తాంబుల్
ఫ్లైట్ 6E 133, పూణే – జోధ్‌పూర్‌
ఫ్లైట్ 6E 112, గోవా – అహ్మదాబాద్

పోలీసుల ప్రకారం.. బెదిరింపులు ఒకే ఎక్స్ అకౌంట్ నుంచి వచ్చినట్లు తెలిపారు. శనివారం ఉదయం నుంచి వివిధ ఎయిర్‌లైనర్లకు చెందిన 30 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. మరోవైపు..విమానయాన సంస్థలకు బూటకపు బాంబు బెదిరింపులను అరికట్టేందుకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కఠినమైన నిబంధనలను ప్రవేశపెట్టనుంది. ఈ చర్యలు కారణమైన వ్యక్తులను నో-ఫ్లై లిస్ట్‌లో ఉంచడం వంటివి చేయనుంది. ముంబై పోలీసులు బూటకపు బెదిరింపులకు సంబంధించి ఒక కేసులో ఛత్తీస్‌గఢ్‌కి చెందిన మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు.

Exit mobile version