Bomb Threats: తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలోని 9 విదేశీ ఎంబసీలకు బాంబు బెదిరింపు మెయిల్స్ తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇవాళ ( సెప్టెంబర్ 30న) చెన్నైలోని తేనాంపేటలోని యూఎస్ కాన్సులేట్ సహా సింగపూర్, కొరియా , స్వీడన్, ఆస్ట్రేలియా, శ్రీలంక, బ్రిటన్ తో పాటు 9 ఎంబసీలకు ఈ-మెయిల్స్ ద్వారా బాంబు హెచ్చరికలు వచ్చాయి. కరూర్ తొక్కిసలాట ఘటన, డీఎంకే మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ పేరును ప్రస్తావిస్తూ, 10 వేరు వేరు మెయిల్ ఐడీలతో డీజీపీ ఆఫీసుకు ఈ హెచ్చరికలు వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. విదేశీ ఎంబసీలకు బాంబు బెదిరింపులు రావడంతో అలర్ట్ అయినా భద్రతా బలగాలు గాలింపు చర్యలు మొదలు పెట్టారు. అన్ని కాన్సులేట్‌లలో బాంబు స్క్వాడ్, డాగ్ స్వాడ్ బృందాల సహాయంతో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు చెన్నై పోలీసులు. విదేశీ కాన్సులేట్‌ల చుట్టూ భారీ భద్రతను పెంచినట్లు పోలీసులు చెప్పుకొచ్చారు.
Read Also: Vayyari Vayyari : ఆకట్టుకుంటోన్న ‘ప్రీ వెడ్డింగ్ షో’ ‘వయ్యారి వయ్యారి’ లిరికల్ వీడియో
అయితే, ముంబై నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానానికి ఇవాళ మరోసారి బాంబు బెదిరింపు మెయిల్స్ రావడం కలకలం రేపుతుంది. 200ల మంది ప్రయాణికులు ఉన్న విమానం గాల్లో ఉండగా ఈ బెదిరింపులు రావడంతో అప్రమత్తమైన ఎయిర్‌లైన్స్ అధికారులు ఢిల్లీ ఎయిర్ పోర్టు అధికారులకు సమాచారం అందజేశారు. దీంతో విమానాన్ని పైలెట్లు సురక్షితంగా హస్తినాలో ల్యాండ్ చేసి.. ఆ తర్వాత క్షుణ్ణంగా విమానం మొత్తం చెక్ చేయగా, ఎలాంటి పేలుడు పదార్థాలు దొరకకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
