Site icon NTV Telugu

Bomb Threat: కొచ్చి-బెంగళూర్ విమానానికి బాంబ్ బెదిరింపు..

Indigo

Indigo

Bomb Threat: కొచ్చి నుంచి బెంగళూర్ వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. కొచ్చి విమానాశ్రయం నుంచి బెంగళూరు బయలుదేరేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. అప్రమత్తమైన అధికారులు వెంటనే ప్రయాణికులను దించేశారు. విమానాన్ని అధికారులు పూర్తిగా తనిఖీలు చేపట్టారు.

Read Also: Asaduddin Owaisi: అక్కడ కూల్చడానికి ముస్లిం ఇళ్లు మిగలలేదు.. నూహ్ ర్యాలీపై ఓవైసీ..

సోమవారం బెంగళూరు వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు ఉన్నట్లు కాల్ వచ్చిందని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. కొచ్చి నుంచి బయలుదేరేందుకు సిద్ధం అవుతున్న సమయంలో ఉదయం 10.30 గంటలకు కాల్ వచ్చింది. విమానంలో ప్రయాణికులను దించేసి, క్షణ్ణంగా తనిఖీలు చేసేందుకు ఐసోలేషన్ బేకు తరలించినట్లు ఎయిర్ పోర్టు వర్గాలు తెలిపాయి. బాంబు బెదిరింపు వచ్చినట్లు నెడుంబస్సేరి పోలీసులు కూడా ధ్రువీకరించారు. దీనిపై ప్రత్యేకంగా ఓ దర్యాప్తు చేస్తోంది. ఆగస్టు 18న ఢిల్లీ-పుణె విస్తారా ఎయిర్ లైన్స్ కు కూడా ఇలాగా బాంబు బెదిరింపులు వచ్చాయి.

Exit mobile version