NTV Telugu Site icon

Delhi rain: విషాదం.. డ్రైనేజీలో ఇద్దరు బాలుర మృతదేహాలు లభ్యం

Drnige

Drnige

దేశ రాజధాని ఢిల్లీలో సృష్టించిన వర్ష బీభత్సం ఆనవాళ్లు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. గురు, శుక్రవారాల్లో కురిసిన భారీ వర్షానికి నగరం అతలాకుతలం అయింది. వాగులు, వంకలు ఏకమై ప్రవహించాయి. ఢిల్లీ ఎయిర్‌పోర్టులోని టెర్మినల్-1 పైకప్పు కూలి ఒకరు మృతిచెందగా.. ఆయా ఘటనల్లో మరో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నీళ్లు ఇంకిపోవడంతో అగ్నిమాపక సిబ్బందికి అండర్‌పాస్‌లో ఇద్దరి బాలుర మృతదేహాలు దొరికాయి. వరద కారణంగా ఇద్దరు బాలురు కొట్టుకుని వచ్చి ఉంటారని భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Sri Lanka: ముస్లిం విద్యార్థుల ఫలితాలు నిలిపివేత.. కారణమేంటంటే..!

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అగ్నిమాపక సిబ్బందికి ఇద్దరు బాలుర మృతదేహాలు ఢిల్లీలోని మెట్రో స్టేషన్‌కు సమీపంలో వరద నీటిలో లభించినట్లుగా వెల్లడించారు. బాలురు స్నానం చేస్తుండగా నీటమునిగి మృతి చెంది ఉంటారని ప్రాథమికంగా అంచనా వేశారు. అండర్‌పాస్ దాదాపు 2.5-3 అడుగుల నీటితో నిండిపోయిందని పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి: Mamata Banerjee: జస్టిస్ డీవై చంద్రచూడ్ ముందే న్యాయవ్యవస్థకు సూచనలిచ్చిన మమతా బెనర్జీ..ఏమన్నారంటే?