NTV Telugu Site icon

Bengaluru: ప్రైవేటు ఫొటోలతో బ్లాక్‌మెయిల్.. మహిళ టెక్కీ ఆత్మహత్య

Bengaluru

Bengaluru

బెంగళూరులో దారుణం జరిగింది. ప్రైవేట్ ఫొటోలతో మామ బ్లాక్ మెయిల్‌కు పాల్పడ్డాడు. దీంతో మహిళా టెక్కీ ప్రాణాలు తీసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం కుండలహళ్లి మెట్రో స్టేషన్‌కు సమీపంలో ఉన్న రాధా హోమ్‌టెల్‌లో ఒంటరిగా కలవాలని మామ ఒత్తిడి చేయడంతో ఆమె బలవన్మరణానికి పాల్పడింది.

ప్రైవేట్ ఫొటోలు, వీడియోలతో మామ, అత్త పదేపదే బ్లాక్ మెయిల్ చేస్తున్నారనే ఆరోపణల కారణంగా 24 ఏళ్ల మహిళా టెక్కీ బెంగళూరులోని హోటల్ గదిలో నిప్పంటించుకుని మరణించినట్లు గురువారం పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడిగా ఉన్న మహిళ మేనమామను అరెస్టు చేసి సమగ్ర విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. మామ వేచి ఉన్న హోటల్ గదికి వెళ్లేందుకు ఆమెకు ఇష్టం లేదని.. అయితే ఫొటోలు, వీడియోలు తల్లిదండ్రులతో పంచుకుంటానని బెదిరించడంతో ప్రాణాలు తీసుకుందని వైట్‌ఫీల్డ్ డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ శివకుమార్ గునార్ తెలిపారు. పెట్రోల్ పోసుకుని ప్రాణాలు తీసుకుందన్నారు. తీవ్ర గాయాలు పాలైన తర్వాత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది.

ఆరేళ్లుగా తన కూతురు మేనమామ, అత్త దగ్గరే ఉంటోందని, వారితో కలిసి విహారయాత్రలకు కూడా వెళుతుందని బాధితురాలి తల్లి తెలిపింది. నిందితుడి దగ్గర నుంచి పెన్ డ్రైవ్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. హెచ్‌ఏఎల్ పోలీస్ స్టేషన్‌లో భారతీయ న్యాయ సంహితలోని వివిధ సెక్షన్ల కింద నిందితులపై కేసు నమోదు చేశారు. సమగ్ర విచారణ జరుగుతోంది.