BJP Worker Killed in karnataka: కర్ణాటకలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. బీజేపీ యువమోర్చా కార్యకర్త దారుణహత్యతో అట్టుడికిపోతోంది. దక్షిణ కన్నడ జిల్లాలో పోలీసులు బందోబస్త్ ను పెంచారు. మంగళవారం సాయంత్రం జిల్లాలోని బెల్లారే ప్రాంతంలో బీజేపీ యువ మోర్చా ఆఫీస్ బేరర్ ప్రవీణ్ నెట్టారును దుండగులు దారుణంగా హత్య చేశారు. బైక్ పైన వచ్చిన దుండగులు దాడి చేసి చంపారు. ప్రవీణ్ నెట్టారు జిల్లా యువమోర్చా కార్యదర్శిగా ఉన్నారు. తన ఫౌల్ట్రీ ఫామ్ మూసివేసి ఇంటికి వస్తున్న తరుణంలో సులియాలో దారుణ హత్యకు గురయ్యాడు. తీవ్రమైన గాయాలతో చావుబతుల మధ్య ఉన్న ప్రవీణ్ ను ఆస్పత్రి తీసుకెళ్లే లోపే మరణించాడు. ప్రవీణ్ మృతదేహాన్ని పుత్తూర్ జిల్లా ఆస్పత్రితో ఉంచారు. ఆస్పత్రి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ప్రవీణ్ మరణానికి నిరసనగా బీజేపీ కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు. వి వాంట్ జస్టిస్ అంటూ బెల్లారే, పుత్తూర్ ప్రాంతాల్లో ఆందోళనలు చేశారు. పుత్తూర్ లో రాళ్లదాడి జరిగింది.
Read Also: Tamil Nadu: మరో స్కూల్ విద్యార్థిని మృతి.. రెండు వారాల్లో నాలుగో సంఘటన
ఈ ఘటనలపై ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై తీవ్రంగా స్పందించారు. ఘటనకు పాల్పడిన వారిని వెంటనే శిక్షిస్తామని ట్వీట్ చేశారు. ’’దక్షిణ కన్నడ జిల్లాలో మా పార్టీ కార్యకర్త ప్రవీణ్ నెట్టారును పాశవికంగా హత్య చేయడాన్ని ఖండించారు. ఇలాంటి కిరాతక చర్యలకు పాల్పడిన నిందుతులను త్వరలోనే అరెస్ట్ చేసి చట్టపరంగా శిక్షిస్తాం.. ప్రవీణ్ ఆత్మకు శాంతి చేకూరాలని.. ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నానని.. ఓం శాంతి’’ అంటూ ట్వీట్ చేశారు.
