Ashok Gehlot on Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొండితనం మూలంగానే హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిందని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు. ఇదే మొండితనం వల్ల మరిన్ని రాష్ట్రాల్లో కూడా బీజేపీ ఓడిపోబోతోందని జోస్యం చెప్పారు. రాజస్థాన్ దివస్ సందర్భంగా సోమవారం జరిగిన లభర్తి ఉత్సవ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులకు పాత పింఛను పథకాన్ని అమలు చేయాలని అప్పటి హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రధానికి సూచించినప్పటికీ.. ప్రధాని పెడచెవిన పెట్టారని అన్నారు. పాత పెన్షన్ పథకం పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీ వల్లనే 2022లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిందని.. ప్రధాని మొండివైఖరి వల్ల బీజేపీ ఓటమిపాలైందని గెహ్లాట్ అన్నారు. ప్రజాస్వామ్యంలో మొండితనానికి తావు లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటరుకు ఎవరైనా తలవంచాల్సిందనేనని, ప్రజల ఓట్లతోనే ఎవరైనా గెలుపు సాధించగలరని అన్నారు.
Read also: Esha Gupta: దాచుకోవాల్సినవన్నీ గాలికి వదిలేసి.. దాన్ని మాత్రం దాస్తావెందుకు పాప
రాజస్థాన్‌లో తమ ప్రభుత్వం ఆమోదించిన ఆరోగ్య హక్కు బిల్లు-2022ని ప్రధాని పరిశీలించాలని కోరారు. రాజస్థాన్‌లో తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల కారణంగా విపక్షాలకు ప్రభుత్వాన్ని విమర్శించే ఎలాంటి అంశం లేదన్నారు. ఏ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలను ఆపివేయడం సరికాదన్నారు. వసుంధరా రాజే ప్రభుత్వం ప్రారంభించిన ఈస్ట్రన్ రాజస్థాన్ కెనాల్ ప్రాజెక్టును తమ ప్రభుత్వం ఆపలేదని పైగా ఆ ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు హోదా కల్పిస్తే త్వరగా పూర్తవుతుందని కేంద్రానికి సూచించారు. ఇటీవల ప్రధాని అజ్మీర్ పర్యటనలో దీనిపై ప్రకటన చేస్తారని తాను ఆశించినప్పటికీ అలా జరగలేదని గెహ్లాట్ అన్నారు.
Read also: Husband Killed Wife: భార్య గొంతు కోసిన భర్త.. కథలో ఊహించని ట్విస్ట్ తెలిస్తే మైండ్ బ్లాకే!
దివాళా తీయడమంటే డబ్బు లేకపోవడం మాత్రమే కాదని.. మేధోపరంగా కూడా దివాళా తీయవచ్చని బీజేపీని ఉద్దేశించి అన్నారు. ఏ ప్రభుత్వమూ తమ ముందున్న పథకాలను నిలిపివేయకూడదని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ప్రారంభించిన పథకాలు ఎన్నికల ఆధారిత ప్రకటనలు కావని.. చాలా కాలం పాటు అమలులో ఉండేందుకు ఉద్దేశించినవని పేర్కొన్నారు.’లాభర్తి ఉత్సవ్’ సందర్భంగా ఇందిరాగాంధీ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పథకం కింద 14 లక్షల మంది లబ్ధిదారుల కుటుంబాల బ్యాన్ ఖాతాలకు బదిలీ చేయబడ్డాయని తెలిపారు. ఏప్రిల్ 1న ప్రారంభించిన ఈ పథకం కింద 76 లక్షల కుటుంబాలకు రూ. 500కి గ్యాస్ సిలిండర్లు అందించబడతాయన్నారు.