బీజేపీ సీనియర్ నేత, రాజకీయ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీ ఢిల్లీలోని అపోలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. బుధవారం రాత్రి అస్వస్థత కారణంగా ఆస్పత్రిలో చేరారు. నిన్నటి నుంచి అద్వానీ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.
ఇది కూడా చదవండి: Bahishkarana : వేశ్యగా అంజలి ‘బహిష్కరణ’.. ఎప్పుడు? ఎక్కడ చూడాలంటే?
96 ఏళ్ల అద్వానీ వృద్ధాప్యంతో బాధపడుతున్నారు. ఇటీవలే ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరినప్పుడు టెస్టులు నిర్వహించి డిశ్చార్జ్ చేశారు. ఇక బుధవారం మరోసారి అస్వస్థతకు గురవ్వడంతో ఆస్పత్రిలో చేరారు. ఆరోగ్యం కుదటపడడంతో గురువారం సాయంత్రం డిశ్చార్జ్ చేసినట్లు అపోలో ఆస్పత్రి పేర్కొంది.
ఇది కూడా చదవండి: Film Chamber: సినీ పరిశ్రమకు రేవంత్ రెడ్డి కండిషన్స్.. ఫిలిం ఛాంబర్ కీలక ప్రకటన!