BJP To Win Big In Tripura, Nagaland, Show Exit Polls: ఈశాన్య రాష్ట్రాల్లో మళ్లీ కమలం విరబూస్తుందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టంగా చెబుతున్నాయి. త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో త్రిపుర, నాగాలాండ్ రాష్ట్రాల్లో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. అయితే మేఘాలయ రాష్ట్రంలో మాత్రం బీజేపీకి చుక్కెదురు అయ్యే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఈ మూడు రాష్ట్రాల్లో అధికారం దక్కించుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 31.
Read Also: Twitter Layoff: డేటా ఎక్స్‌పర్ట్స్, ఇంజనీర్లను ఉద్యోగాల నుంచి తొలగించిన ట్విట్టర్
నాగాలాండ్ రాష్ట్రంలో మొత్తం 60 అసెంబ్లీ సీట్లలకు గానూ.. ఎన్డీపీపీ+బీజేపీ 35-43 సీట్లను గెలుచుకుంటుందని, కాంగ్రెస్ 1-3, ఎన్పీఎఫ్ 2-5 సీట్లను గెలుచుకునే అవకాశం ఉందని ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా సర్వే ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. త్రిపురలో లో ఎన్డీపీపీ+బీజేపీ కూటమి 60 అసెంబ్లీ సీట్లకు గానూ.. 36-45 అసెంబ్లీ నియోజకవర్గాలను గెలుచుకుంటుందని, లెఫ్ట్ పార్టీ 6-11 స్థానాలకే పరిమితం అవుతుందని, కాంగ్రెస్ ఒక్కస్థానంలో కూడా గెలుచుకోదని జీ న్యూస్ ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.
మేఘాలయాలో మాత్రం బీజేపీకి మెజారిటీ సీట్లు రావని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. మేఘాలయాలో 60 స్థానాల్లో 18-24 గెలుచుకునే అవకాశం ఉందని, కాంగ్రెస్ 6-12, బీజేపీ 4-8 స్థానాల్లో గెలుపొందుతాయని ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. అయితే జీ న్యూస్-మాట్రిజ్ మాత్రం ఎన్పీపీ 21-26, బీజేపీ 6-11, కాంగ్రెస్ 3-6 స్థానాలు గెలుపొందుతుందని అంచనా వేసింది.
